Karnataka Election Results: దేశమంతా ఉత్కంఠ రేపిన కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. బీజేపీ ఓటమిని అంగీకరించి మౌనరాగం అందుకుంది. కింగ్ మేకర్ అనుకున్న జేడీఎస్‌కు అన్నీ మూసుకుని కూర్చుంది. నేతలు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఫలితాలపై బెట్టింగులు పెట్టిన పార్టీ శ్రేణులు, సానుభూతిపరులు పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. కాంగ్రెస్‌పై పందెం కాసిన వారు సంబురాలు చేసుకుంటుండగా, బీజేపీ గెలుపుపై పందెం కాసిన పందెం రాయుళ్లు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.
భూమి, వాహనాలతో పందెం..
ఓ రైతు తన నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తాడంటూ రెండు ఎకరాల తోట పందెం కాసాడు. తన పందెం గురించి చాటింపు వేయించి మరీ సవాల్ చేశాడు. నేను కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని రెండు ఎకరాలు పందెం కాసాను..మరి ఎవరైనా పోటీకొస్తారా? అంటూ సవాల్ చేస్తు గ్రామం అంతా చాటింపు వేయించాడు. మరో వ్యక్తి బైక్ పందెంగా పెట్టాడు.ఇంకొకరు కోటి రూపాయలు ఇలా బెట్టింగ్‌ల జోరు కొనసాగింది. ఫలితాలకు ముందు ఇలా బెట్టింగ్ రాయుళ్లు పందేలు కాస్తు మాంచి జోరుమీదు కనిపించారు.
ఫలితాల తర్వాత..
అయయ్యో.. చేతుల డబ్బులు పాయెనే.. అయయ్యో.. పార్టీ కూడా పాయెనే అన్నట్లుగా ఉంది బీజేపీ పందెంరాయుళ్ల పరిస్థితి. ఎన్నికల రోజు సాయంత్రం వరకు బెట్టింగ్ రాయుళ్లలో బీజేపీ గెలుపుపై ధీమా కనిపించింది. 6:30 తర్వాత ఎగ్జిట్‌పోల్ ఫలితాలు రాగానే కొంత నైరాశ్యం కనిపించింది. అయినా కొంతమంది మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఎగ్జిట్ పోల్స్‌ను కూడా లెక్కచేయకుండా పందేలు కాశారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరిని పలకరించినా.. బోరుమంటున్నారు.
అతివిశ్వాసమే కొంప ముంచింది..
బీజేపీపై పందెం కాసిన వారి అతి విశ్వాసమే వారి కొంప ముంచిందంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లా కర్ణాటకలోనూ బీజేపీ చరిత్రను తిరగ రాస్తుందని చాలా మంది బీజేపీ అభిమానులు, పార్టీ నేతలు నమ్మారు. కానీ, వారిది అతి విశ్వాసమే అని ఫలితాలు తేల్చాయి. ప్రజల నాడి తెలుసుకోకుండా పందేలు కాశాలని అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో అధికార బీజేపీ అవినీతి ముందు మోదీ చరిష్మా కూడా చిన్నబోయిందని పేర్కొంటున్నారు. చాలా మంది మోదీ చరిష్మాను నమ్ముకునే పందెం కాశారని చెబుతున్నారు. అయితే మోదీని మించిన అవినీతి కన్నడనాట జరుగడంతోనే ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఫుల్ పవర్స్ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.