అతనో బార్బర్ కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఐపీఎల్ పుణ్యామా అని డ్రీమ్ -11 యాప్ తో అదిరిపోయే జాక్ పాట్ తగిలింది. అతడు రాత్రికి రాత్రే కోటేశ్వరుడు అయ్యిడు. ఏకంగా కోటు రూపాయలు గెలవడంతో అతడి జీవితమే మారిపోయింది. బీహార్ లోని మధుభానీ జిల్లాలో సెలూన్ నిర్వాహకుడు అశోక్ కుమార్ ఠాకుర్ కు డ్రీమ్ -11 రూపంలో అదృష్టం తలుపు తట్టింది. రూ. కోటి అతడి వశమైంది. నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ కు ఓ సెలూన్ ఉంది. ఆ దుకాణమే అతడకి జీవనాధారం.

క్రికెట్ పై ఆసక్తితో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ -11 లో అశోక్ తరచూ బెట్టింగ్ పెట్టేవాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ పై బెట్టింగ్ పెట్టాడు. అనూహ్యంగా రూ. కోటి దక్కించుకున్నాడు. ఆ సంగతి తెలియగానే అశోక్ ఆనందానికి అవధులు లేవు. గతంలో ఎన్నో సార్లు బెట్టింగ్ పెట్టానని, ఎప్పూడు గెలవలేదని ఈ సందర్భంగా అతను చెప్పాడు. రూ. కోటి వచ్చినా.. తన వృత్తిని మాత్రం వదులుకోనని చెప్పాడు. బెట్టింగ్ ద్వారా వచ్చిన రూ. కోటితో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు. రెండు, మూడు రోజుల్లో నగదు అశోక్ బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశముంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత నేను మొదటి స్థానంలో నిలిచాను. ఆ కాంటెస్ట్ లో రూ. కోటి వచ్చాయి. కాసేపటికే అధికారికంగా ఫోన్ కాల్ వచ్చింది అని తెలిపాడు. మీ ఖాతాలో 70 లక్షలు జమవుతాయని కోటి రూపాయల్లో పన్నులు పోగా మిగతా డబ్బులు అందుతాయని తెలిపాడు. రాత్రంతా నిద్రపట్టలేదు. అని అశోక్ తన ఆనందనాన్ని పంచుకున్నాడు.