స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు తమకు సంబంధించిన కొన్ని మధురమైన క్షణాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో తరచుగా పంచుకుంటూ ఉంటారు. కాగా తాజాగా తన సతీమణి స్నేహ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఆమెకు స్పెషల్ విషెస్ చెప్పాడు. ఈ క్రమంలో ఫ్యామిలీ ఫోటోని షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో అత్యంత స్పెషల్ వ్యక్తికి ప్రత్యేక పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం. మరెన్నో జన్మదినాలు నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్ డే క్యూటీ’ అంటూ బన్నీ పోస్ట్ చేశాడు.

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అందమైన, అనోన్యమైన జంటల్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి జంట కూడా ఒకరు. వీరిది ప్రేమ వివాహం. 2011లో పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు. ఇక తన కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ జంట.
ఇక బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నా.. తన సతీమణి బర్త్ డే సందర్భంగా దుబాయ్ వేకేషన్ టూర్ ప్లాన్ చేశాడు. తన కుటుంబంతో కలిపి దుబాయ్ వెళ్ళి సరదగా గడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి బన్నీ పోస్ట్ చేసిన పిక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
కాగా సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’ రెండు పార్టులుగా రానుంది. ఈ సినిమాలో మొదటి భాగం డిసెంబర్ లో విడుదల కానుంది. కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని పక్కా పాన్ ఇండియా సినిమాగా ప్లాన్ చేస్తున్నాడు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్. కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.