Ayodhya Ram Mandir: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరబోతున్నాడు. ఈమేరకు జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లాను ప్రతిష్టించబోతున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశవ్యాప్తంగా హిందువులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆహ్వానాలు అందుకున్నవారు అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ క్రతువు జరిపించనున్నారు. మరోవైపు అయోధ్యలో కొలువుదీరే సీతారాముల కోసం ఆభరణాలు, బంగారు చీర, కానుకలు, ప్రసాదాలు అయోధ్యకు చేరాయి.
వేడుక వీక్షించేలా సెలవు..
500 ఏళ్ల భారతీయు కల నెరవేరబోతున్న ప్రస్తుత తరుణంలో ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు ఆసక్తిగా, ఉత్సాహంగా ఉన్నారు. అయితే నేరుగా అయోధ్యకు వెళ్లలేని వారికోసం ప్రత్యక్ష ప్రసారానికీ ఏర్పాట్ల చేశారు. దీంతో చాలామంది ఇంట్లోనే ఉండి టీవీలలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అపూర్వ వేడుక నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 22న ఆఫ్‌డే సెలవు ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలు కూడా సెలవును ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి సెలవు ఇవ్వగా, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం మధ్యాహ్నం 2:30 గంటల వరకు మాత్రమే సెలవులు ఇచ్చాయి. యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి రాష్ట్రాలు పూర్తి సెలవు ఇవ్వగా.. గుజరాత్, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, అసోం, ఒడిశాలు మాత్రం సగం రోజు సెలవు ఇచ్చాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పాఠశాలలకు సెలవు ఇచ్చాయి. ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ రిలయన్స్ తమ సంస్థలఉద్యోగులకు సోమవారం సెలవు ప్రకటించింది.