Ram Mandir: దేదీప్యమానం అయోధ్య బాల రాముడి దర్శనం.. ఫొటోలు వైరల్

బాల రాముడి విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ కృష్ణ శిలతో చెక్కారు. 51 అంగుళాల ఎత్తులో తీర్చిదిద్దిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. పద్మ పీఠంపై 51 అంగుళాల ఎత్తులో బాలరామయ్య దర్శనం ఇవ్వనున్నారు.

Written By: Dharma, Updated On : January 20, 2024 6:14 pm

Ram Mandir

Follow us on

Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతోంది. మరో రెండు రోజుల్లో కన్నుల పండుగగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని రెండు రోజుల కిందట గర్భగుడిలో చేర్చారు. ఈ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలను బిజెపి సీనియర్ నాయకులు తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మరోవైపు రామ మందిరం ట్రస్ట్ ప్రతినిధులు సైతం ఫోటోలను ధ్రువీకరిస్తున్నారు. ముఖ్యంగా బాల రామయ్య రూపం భక్తులను తెగ ఆకట్టుకుంటుంది. ఐదేళ్ల వయసులో ఉన్న రాముడి నిలువెత్తు రూపమే ఈ బాల రాముని విగ్రహం. రాముడు చిన్నప్పుడు ఇలానే ఉండేవాడా? అన్నట్టు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

బాల రాముడి విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ కృష్ణ శిలతో చెక్కారు. 51 అంగుళాల ఎత్తులో తీర్చిదిద్దిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. పద్మ పీఠంపై 51 అంగుళాల ఎత్తులో బాలరామయ్య దర్శనం ఇవ్వనున్నారు. ఈ విగ్రహానికి ప్రత్యేకతలు ఉన్నాయి. బాల రాముని విగ్రహంలో కుడి చేతిలో బంగారం ధనస్సు, ఎడమ చేతిలో బంగారం బాణం పట్టుకుని భక్తులకు దర్శనమిస్తున్నాడు. విగ్రహం మొత్తం 250 కేజీల బరువు ఉన్నట్లు చెబుతున్నారు. రాముడి విగ్రహం మకర తోరణం కింద భాగంలో హనుమాన్, గరుడ విగ్రహాలను చెక్కారు. విగ్రహానికి ఇరువైపులా దశావతారాల విగ్రహాలను తీర్చిదిద్దారు. విగ్రహం పై భాగంలో ఓం, శేషనాథ్, సూర్య, గద, స్వస్తిక్, అభా మండలాల్ ను చెక్కారు. నిండైన ముఖం, చిరునవ్వు, చిత్విలాసంతో కనిపిస్తున్న బాల రాముని విగ్రహాన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు. అయితే ప్రాణ ప్రతిష్ట కంటే ముందే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 22న ప్రాణ ప్రతిష్ట జరగనుంది. తొలుత ప్రధాని మోదీ విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి దర్శనం చేసుకుని ఉన్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు. ఇప్పటికే బలరాముడి విగ్రహ రూపు రేఖలు ఎలా ఉంటాయో రామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ వెల్లడించారు. ఏర్పాట్లను సైతం వివరించారు. భద్రతా చర్యలను, భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే ప్రయత్నం చేశారు. భక్తులు ఎవరూ అయోధ్య రావద్దని విజ్ఞప్తి చేశారు.సమీపంలోని ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు చేసుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.