Sankranti 2024 Movies: కంటెంట్ నార్మల్ గా ఉన్నా.. సంక్రాంతి వల్ల హిట్ అయిన సినిమాలు

2024 సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ సినిమా నెగటివ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమా చూసిన వారు రెండవ రోజు ఉంటుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ సీజన్ పుణ్యమా అని కలెక్షన్లు వచ్చాయి.

Written By: Swathi, Updated On : January 20, 2024 5:39 pm

Sankranti 2024 Movies

Follow us on

Sankranti 2024 Movies: ఒక సినిమా హిట్ అవ్వాలంటే మౌత్ టాక్ ఎక్కువ ప్రాధాన్యత వహిస్తుంది. సినిమా బాగాలేదనే టాక్ వస్తే ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది. ఒక వేళ హిట్ అని టాక్ వస్తే బాక్సాఫీస్ బద్దలు అవడం ఖాయం. కానీ హిట్ టాక్ తో పెద్దగా సంబంధం లేకుండా ఒక సీజన్ లో సినిమాలు హిట్ ఫ్లాప్ లను సొంతం చేసుకుంటాయి. అదే సంక్రాంతి సీజన్. పండుగ సెలవులలో ఎంజాయ్ అని..లేదా స్పెషల్ గా గుర్తుండాలని బయటకు వెళ్తుంటారు. మొత్తం మీద థియేటర్లను ఎంచుకునే వారు కూడా ఎక్కువగా ఉంటారు. అలా సినిమా థియేటర్లు కిక్కిరిసిలాడుతుంటాయి. అయితే సినిమా కంటెంట్ లేకున్నా కూడా సంక్రాంతి సీజన్ లో హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి మరి వాటి చిట్టా చూసేయండి.

1..గుంటూరు కారం: 2024 సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ సినిమా నెగటివ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు సినిమా చూసిన వారు రెండవ రోజు ఉంటుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ సీజన్ పుణ్యమా అని కలెక్షన్లు వచ్చాయి.

2..శతమానం భవతి: 2017లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు. కానీ కలెక్షన్లు మాత్రం బాగా సంపాదించింది. ఈ సినిమాకు మిశ్రమ టాక్ తో కలిసి వచ్చింది.

3.. ఐ: మొదటి రోజు ఈ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ తర్వాత మాత్రం సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది.

4.. సరిలేరు నీకెవ్వరు: ఈ సినిమా కంటెంట్ కూడా నార్మల్ అన్నారు. కానీ హీరో, దర్శకుడికి ఉన్న క్రేజ్ వల్ల సినిమా హిట్ ను సొంతం చేసుకుంది.

5..మాస్టర్: తమిళ్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాకు కూడా సంక్రాంతి సీజన్ కలిసి వచ్చింది. అంతేకాదు లోకేష్ కనకరాజ్ క్రేజ్ చాలా కలిసి రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

6..జై సింహ: మొదటి రోజు నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న జై సింహ సినిమా తర్వాత మంచి హిట్ ను సొంతం చేసుకుంది. దీనికి కారణం సంక్రాంతి అని చెప్పడంలో సందేహం లేదంటారు నెటిజన్లు.

7..రెడ్: రిలీజ్ రోజు నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుది. కానీ సంక్రాంతి వల్ల గట్టెక్కింది.

8..నాయక్, బిజినెస్ మాన్: నాయక్ సినిమాకు వివి వినాయక్ ట్రాక్ రికార్డు కలిసి వచ్చి, సీజన్ కూడా కలిసి రావడంతో హిట్ ను సొంతం చేసుకుంది. ఇక బిజినెస్ మాన్ కూడా సంక్రాంతి సీజన్ వల్లే హిట్ ను సొంతం చేసుకుంది అంటారు కొందరు.