
April 1st Fools Day : ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులను కూల్ చేసే ఆడుకోవడం భలే సరదాగా ఉంటుంది. ‘నీ చొక్కా మీద ఏదో పడింది’ అని చెప్పగానే ఒకప్పుడు వెనక్కి చూసుకునేవారు. దీంతో వెంటనే ‘ఏప్రిల్ ఫూల్’ అని వారిని ఫూల్ చేసి ఆట పట్టించే వాళ్ళం. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటే జనాలు కూడా ముదిరిపోయారు. కాబట్టి ఎవరినైనా ఫూల్ చేయాలంటే కొత్త ఐడియాలతో ముందుకు రావాలి. మరింత అప్డేట్ కావాలి. కాబట్టి ఈ సరికొత్త ఫ్రాంక్ ఐడియాలతో మీ బంధుమిత్రులను ఫూల్స్ చేయండి. అయితే ముందుగా ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారు ఒకసారి చూసేద్దాం.
అలా మొదలైన ఏప్రిల్ ఫూల్స్ డే..
ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే అనేది ప్రత్యేకంగా ఒకరు మొదలు పెట్టారని చెప్పడానికి ఆధారాలేవీ లేవు. అయితే ప్రాచీన కాలం నుంచి ఈ రోజున సరదా దినంగా పాటించే సాంప్రదాయం ఉన్నట్లు తెలిసింది. అంటే ఇతరులను ఆట పట్టించి ఫూల్స్ చేయడం ద్వారా హాస్యాన్ని ఆస్వాదించడం కోసం అలా చేసేవారట. ఈ సాంప్రదాయం జూలియన్ క్యాలెండర్ నుంచి మొదలైనట్లు చెబుతుంటారు. ఫ్రాన్స్ లో 11వ పోప్ చార్లెస్ పాత క్యాలెండర్ స్థానంలో రోమన్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అప్పట్లో ఏప్రిల్ 1వ తేదీని నూతన సంవత్సరంగా జరుపుకునేవారు. అయితే 1582 నుంచి జనవరి నెలలో కొత్త సంవత్సరాన్ని నిర్వహించడం మొదలుపెట్టారని, ఎవరైనా ఏప్రిల్ ఒకటో తేదీని న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పినట్లయితే వారిని వెర్రివాళ్లుగా భావించే వారని సమాచారం. వారిని ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవారట. అది క్రమేనా ఏప్రిల్ ఒకటో తేదీ ఫూల్స్ డే గా మారినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.
ఇక సరికొత్త ఫ్రాంకులతో ఆటపట్టించండి..
ఏప్రిల్ ఒకటో తేదీన స్కూల్స్ చేయాలనుకునేవారు భిన్నంగా ప్రయత్నించడం ద్వారా దాన్ని విజయవంతం చేయవచ్చు.
* వాసు బేసిన్ ట్యాప్ లోకి కలర్లు గుడ్లు నింపేయండి. ట్యాప్ చెప్పగానే నేలకు బదులు రంగు నీళ్లు వస్తే షాక్ అవుతారు.
* ఆఫీసులోని పనిచేసేటప్పుడు మౌస్ కింద టేప్ అంటించేయండి. అది కాసేపు పని చేయక బుర్రగోక్కంటూ ఉంటే మీరు అలా హీరోలా ఫోజు కొట్టి టేప్ తీసేయండి. ఫ్రెండ్ ఫూల్ అవ్వకుండా ఉంటాడా మరి.
* ఫోను అన్లాక్ చేసి స్క్రీన్ షాట్ తీయండి. తర్వాత ఫోన్లో ఆప్షన్ వేరే స్లైడ్ లోకి మూవ్ చేసి.. ఆ స్క్రీన్ షాట్ ను వాల్ పేపర్ గా సెట్ చేయండి. యాప్ ఓపెన్ చేద్దామని స్క్రీన్ టచ్ చేస్తాడు. ఫూల్ అవడం ఖాయం.
* ఇంట్లో మీ తమ్ముడు చెల్లెలు టీవీ రిమోట్ తీసుకొని ఎంతకు ఇవ్వడం లేదా. ఇదే కరెక్ట్ టైం. ఎల్ఈడి ముందు భాగం కవరయ్యేలా స్టిక్కర్ అతికించండి. ఎంత నొక్కినా ఛానల్ మారదు.
* సాక్షులు వేసుకోవడానికి ఇబ్బంది పడేలా వాటిని సూదితో కుట్టేయండి. కాలు పెట్టిన లోపలకెళ్లాక కాసేపు మిమ్మల్ని నవ్విస్తాడు.
* ఇద్దరు రూమ్మేట్స్ అయితే తను వాడే సోప్ మీద కలర్ లెసన్ నెయిల్ పాలిష్ ను ఓ పొరలా రాసేయండి. ఉదయాన్నే లేవగానే స్నానం చేయడానికి వెళ్తే ఇంకెక్కడి నురగ. మళ్లీ ఫూల్ కావడం ఖాయం.
* ఓరియో బిస్కెట్ ప్యాకెట్ కొనండి. క్రీమ్ తీసేసి మధ్యలో టూత్ పేస్ట్ పెట్టి తినమని ఇవ్వండి. పొద్దున బ్రష్ చేసిన మీ ఫ్రెండ్ మరోసారి బ్రష్ చేసుకోవడం ఖాయం.
* షాంపూ బాటిల్ ఓపెన్ చేసి రంధ్రం దగ్గర ప్లాస్టిక్ కవర్ ఉంచి మళ్ళీ మూత పెట్టేయండి. ఎంత వత్తిన షాంపు బయటికి రాదు.
* ఇప్పుడు అందరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఫోన్ చూస్తారు. కాబట్టి ఈ పూల్స్ డే ను ఫోన్ తోనే మొదలు పెట్టండి. గూగుల్ లోకి వెళ్లి మంచి రోజులు ఉన్న రాకెట్ స్క్రీన్ ఇమేజ్ ఒకటి డౌన్లోడ్ చేయండి. దాన్ని లాక్ స్క్రీన్ వాల్ పేపర్ గా సెట్ చేయండి. చూడగానే ఒక క్షణం పాటు నిజంగానే ఫోన్ స్క్రీన్ పగిలిపోయిందని భ్రమించడం ఖాయం.
సోషల్ మీడియాలో జోరుగా జోకులు..
ఇక సోషల్ మీడియాలో ఫూల్స్ డే సందర్భంగా పెద్ద ఎత్తున జోకులు పేరుతున్నాయి. అనేక మీమ్స్ విస్తృతంగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. విభిన్నమైన రీతుల్లో చాలామంది ఈ ఫూల్స్ డే రోజు తమ స్నేహితులు బంధువులను ఆటపట్టించే ప్రయత్నాలు చేస్తూ కూర్చుని చేస్తున్నారు. అవన్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.