Homeక్రీడలుIPL2023: PBKS vs KKR : ఇది సిక్స్ కాదు.. అంతకు మించి.. దెబ్బకు బంతి...

IPL2023: PBKS vs KKR : ఇది సిక్స్ కాదు.. అంతకు మించి.. దెబ్బకు బంతి స్టేడియం అవతలకి

IPL2023: PBKS vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో శనివారం మొహాలిలో ప్రారంభమైన రెండవ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి ఆతిథ్యం ఇస్తోంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. హోమ్ పిచ్ పై చెలరేగిపోయింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీనిని చేదించేందుకు కోల్ కత్తా తడబడుతోంది.. ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది..భానుక రాజపక్స 50 పరుగులు చేశాడు.. 32 బంతుల్లో 50 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద ఉన్న మన్దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులతో రాణించాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 23, జితేష్ శర్మ 21, సికిందర్ రజా 16, సామ్ కర్రన్ 26, షారుఖ్ ఖాన్ 11 పరుగులు చేశారు.

192 పరుగుల విజయ లక్ష్యంతో భారీ లోకి దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఆదిలోనే తడబడుతోంది. అర్ష్ దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి మన్దీప్ సింగ్ బలయ్యాడు. అప్పటికీ జట్టు స్కోరు 13 పరుగులు మాత్రమే. అదే ఓవర్ చివరి బంతికి అనుకుల్ రాయ్ కూడా ఔట్ అయ్యాడు. నాలుగు పరుగులు చేసిన ఇతడు సికిందర్ రాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆఫ్గనిస్తాన్ కు చెందిన రెహామనుల్లా గుర్బాజ్ గురించి..

ఇతడు చేసింది తక్కువ పరుగులే అయినప్పటికీ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. తాను ఎదుర్కొన్న రెండవ బంతిని భారీ సిక్సర్ గా మలిచాడు. ఆ బంతిని స్టాండ్స్ దాటించాడు. దాని దూరం 101 మీటర్లు అంటే.. ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన వాటిల్లో ఇదే భారీ సిక్సర్..

ఐపీఎల్ లో గుర్బాజ్ కి ఇది ఆరంగేట్ర మ్యాచ్. సామ్ కర్రన్ వేసిన ఓవర్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్ గా మలిచి స్టేడియం అవతల వైపు పడేలా కొట్టడం మాములు విషయం కాదు. ఆ తర్వాత కూడా అతడి జోరు కొనసాగింది. ఆరో బంతికి ఫోర్ కొట్టాడు. 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు.. ఆ తర్వాత ఎల్లీస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఇతడు కొట్టిన భారీ సిక్సర్ నెట్టింట వైరల్ గా మారింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular