Ram Mandir: ఆయోధ్య ఆలయ నిర్మాణ ఖర్చు కంటే.. అంబానీ సంపదే ఎక్కువ.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?

అపర కుభేరుడు ముఖేష్ అంబానీ ధనవంతుల జాబితాలో టాప్ 10 లో ఉంటున్నారు. ఆయన సంపద రోజురోజుకు పెరగడమే గానీ తగ్గడం లేదు. తాజాగా ఆయన సంపద విలువ 103 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Written By: Chai Muchhata, Updated On : January 17, 2024 5:15 pm

Ram Mandir

Follow us on

Ram Mandir: ప్రపంచమంతా ఇప్పుడు ఆయోధ్య వైపు చూస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామమందిరం ను ఈనెల 22న ప్రారంభించబోతున్నారు. ఈరోజు శ్రీ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయోధ్య ఆలయ నిర్మాణంపై ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంది. ఈ తరుణంలో అయోధ్యకు అయిన ఖర్చు రూ.1800 కోట్లు అని ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ అంచనా వేసింది. అయితే ఈ ఖర్చు ముఖేష్ అంబానీ ఒక్కరోజులో సంపాదించాడు. ఆయన తలుచుకుంటే ఇటువంటి ఆలయాలు ఎన్నో కట్టొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే?

అపర కుభేరుడు ముఖేష్ అంబానీ ధనవంతుల జాబితాలో టాప్ 10 లో ఉంటున్నారు. ఆయన సంపద రోజురోజుకు పెరగడమే గానీ తగ్గడం లేదు. తాజాగా ఆయన సంపద విలువ 103 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ విషయాన్ని బ్లూమ్ బెర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. భారత కరెన్సీ ప్రకారం ముఖేష్ అంబానీ సంపద విలువ రూ.8,55,730 కోట్లు. ఇదంతా ఒక్క ఏడాదిలోనే. అంటే ఆయన రోజుకు సంపాదించింది రూ.2,345 కోట్లు. ఈ లెక్కన రామమందిరం మొత్తం నిర్మాణానికి అయ్యే ఖర్చును అంబానీ ఒక్కరోజులో సంపాదిస్తున్నాడని అర్థమవుతోంది.

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగింది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా 7 వేల మంది ప్రముఖులకు ఆహ్వానం పంపారు. ఇందులో సినీ తారులు, వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి సినీ సెలబ్రెటీలకు ఆహ్వానం అందింది. అలాగే ఇక్కడి బీజేపీ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే రాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం ఊరూరా నిర్వహించారు.

ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దగ్గరుండీ చూసుకుంటున్నారు. 22న ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని మోదీ వారం రోజుల పాటు సాత్విక ఆహారం తీసుకుంటూ రాముని దీక్ష తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే దేశంలోని ప్రతీ గ్రామంలో రాముని విగ్రహ ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.