Aam Aadmi Party: అమ్ ఆద్మీ పార్టీ దూడుకు పెంచుకుంటోంది. ఢిల్లీలో అధికారం చేపట్టిన పార్టీ ఉత్తరాదిన పొరుగు స్టేట్లలో కూడా తన ప్రభావం చూపించుకోవాలని భావిస్తోంది. ఢిల్లీలో ఇప్పటికే మూడుసార్లు వరుసగా అధికారం చేపట్టిన పార్టీ పంజాబ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తోంది. ఆప్ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ముందుకు పోతోంది. గతంలో పంజాబ్ లో మూడు ఎంపీ, 16 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న ఆప్ కు ఈ సారి పంజాబ్ లో కూడా అధికారం ఖాయమని చెబుతున్నారు.

ఆప్ లో వివాదాల కారణంగా అన్నింటికి దూరమైందని తెలుస్తోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో పంజాబ్ వైపు చూడలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఆప్ కు అనుకూలంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కేజ్రీవాల్ దూకుడు పెంచారు. పంజాబ్ లో అధికారం చేజిక్కించుకునే పనిలో పడ్డారు. పలు మార్లు సర్వేలు నిర్వహించి పలితాలు వస్తాయని ఆకాంక్షిస్తున్నారు.
ఈనేపథ్యంలో పంజాబ్ లో అధికారంలోకి రావడానికి హామీలు ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు. ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇస్తున్నారు. దీంతో రాబయే ఎన్నికల్లో ఆప్ తన సత్తా చాటుతుందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలో ఉన్న విద్వేషాలను ఆప్ క్యాష్ చేసుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది.
పంజాబ్ లో పెద్ద పార్టీలు తమ బలం నిరూపించుకోవడం లేదు. దీంతోనే ఆప్ కు కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తట్టుకుని ఆప్ పోటీలో నిలిచి అధికారం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.