CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా జగన్ సర్కార్ మరో కొత్త పథకం అమలుకు సిద్ధమైంది. జగన్ సర్కార్ ఈబీసీ నేస్తం పేరుతో ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు సంవత్సరానికి 15,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.

ఏపీ ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాలలో ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 45,000 రూపాయలు అందించనుందని తెలుస్తోంది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అగ్ర కులాలకు చెందిన మహిళలు ఈ పథకం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈబీసీ మహిళల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు కోసం ఏడాదికి 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అందిస్తుండటం గమనార్హం. వైఎస్సార్ చేయూత, కాపునేస్తం స్కీమ్స్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు కాదు. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు తమ పేరుతో ఆధార్ కార్డ్ తో బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. లబ్ధిదారులకు 3 ఎకరాల కంటే పల్లపు భూమి తక్కువగా ఉండాలి.
మెట్ట భూమి అయితే 10 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉండకూడదు. పారిశుధ్య కార్మికులకు మాత్రం ఇందుకు సంబంధించి మినహాయింపు ఉంటుంది. కుటుంబంలో ట్యాక్స్ చెల్లించేవారు సైతం ఎవరూ ఉండకూడదు. అర్హత ఉన్న మహిళలు గ్రామ, వార్డ్ వాలంటీర్లను సంప్రదించి లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోగాలి.