Malaika Arora Injured In Car Accident: బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముంబయి నుంచి పూణె వెళ్తుండగా పన్వేల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మలైకా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల.. అదే సమయంలో రాజ్ ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మీటింగ్ కోసం వెళ్తున్న వాహనాలను.. కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మలైకా అరోరా తలకు గాయమైంది. వెంటనే ఆమెను ఆపోలో ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని.. కాకపోతే మలైకకు బాగా గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇక మలైకా కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అలాగే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కూడా విచారణ జరిపి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నామనీ పోలీసులు చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో చయ్యా చయ్యా పాటతో ఓవర్ నైట్ స్టారైపోయారు మలైకా.
Also Read: pawan kalyan yatra for farmers : జనంలోకి జనసేనాని: రైతు ఓదార్పు యాత్రలో పవన్ కళ్యాణ్
మాహి వే, మున్నీ బద్నం లాంటి హిట్ ఐటమ్ నంబర్లతో క్రేజ్ పెంచుకున్నారు. పలు టీవీ షోలకు జడ్జిగా, హోస్టుగానూ ఆమె వ్యవహరించారు. కానీ ‘మలైకా అరోరా’ అర్జున్ కపూర్ తో రొమాన్స్ కి అలవాటు పడి, తన మాజీ భర్త అయిన ‘సల్మాన్ తమ్ముడి’కి హ్యాండ్ ఇచ్చి, అర్జున్ కపూర్ ను పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుందని ఆ పెళ్లి కాలేదు.
పెళ్లి కాకపోయినా 36 ఏళ్ల అర్జున్ కపూర్ తో 48 ఏళ్ల మలైకా అరోరా చాలా కాలంగా సహా జీవనం చేస్తూ ఉంది. ఏది ఏమైనా 48 ఏళ్ల వయసులోనూ ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ భారీ బ్యూటీ ప్రతి రోజు వ్యాయామాల పేరుతో హాట్ హాట్ ఫోజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా మలైకా డ్రెస్సింగ్ పై నిత్యం నెట్టింటా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ వయసులో ఇదేం డ్రెస్ అంటూ ఆమె పై నెటిజన్లు జోక్ లు పేలుస్తూనే ఉంటారు. అయినా ఇలాంటి డ్రెస్ లు మలైకాకి కొత్తేమి కాదు. ఎందుకంటే.. ఆమె క్రమం తప్పకుండా యోగా క్లాసెస్‌కి వెళ్తుంది, ఆ సమయంలో నిత్యం ఇలాంటి డ్రెస్ లనే వేసుకుంటుంది. మొత్తానికి కారు ప్రమాదంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది.
Also Read:Bandi Sanjay ‘Praja Sangrama Yatra’: పాతబస్తీలో దుమ్ము దుమారం.. ‘బండి’ కదిలింది..