Araku coffee : అరకు కాఫీ అరుదైన ఘనత సాధించింది. ఈ సారి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. ప్రపంచంలోనే తొలి గిరిజన అర్గానిక్ బ్రాండ్‌గా వినతికెక్కింది. ఇప్పటికే విదేశీయుల మనసు దోచుకుని వారితో లొట్టలేసుకుని సిప్పుల మీద సిప్పులు వేయిస్తూ అరకు కాఫీ లేకుండా పూట గడవని పరిస్థితి తీసుకొచ్చింది. జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ వాసులకు వ్యసనంలాగా మారిపోయింది. తాజాగా ఈ కాఫీ బ్రాండ్‌ను గ్రేట్ ఇండియన్ బ్రాండ్లలో ఒకటని నీతి అయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు. దానిని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రీ-ట్వీట్ చేశారు.
జీ-20 సమ్మిట్‌లో..
అమితాబ్ కాంత్, ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా అరకు కాఫీ గురించి ప్రస్తావన తీసుకురావడంతో మరోసారి దీనిపై చర్చ మొదలయింది. ‘ఇండియాలో జీ-20 సమావేశాలు జరుగుతున్నాయి. విదేశీ ప్రతినిధులకు అందమైన ప్యాక్‌లలో భద్రపరిచిన కాఫీ పొడిని అందిస్తున్నాం. సెగలు కక్కే కాఫీని పరిచయం చేస్తున్నాం. వారు దీనిని సిప్పుల మీద సిప్పులు వేస్తున్నారు. మళ్లీ మళ్లీ అడుగుతున్నారు.’ అని అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. ఇది ప్రపంచంలోని తొలి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్‌గా పేరొందని కితాబిచ్చారు.
అరబికా రకం సాగు
విశాఖ మన్యంలో అరబికా రకం కాఫీ సాగవుతోంది. ఇది ఇప్పటికే పారీస్‌లో పాగా వేసింది. జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్‌కూ ఎగుమతలవుతున్నాయి. ఈ కాఫీని అక్కడి ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. సేంద్రియ విధానంలో సాగవుతున్న ఈ కాఫీలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయని, అందుకే విదేశీయులు ఇష్టపడుతున్నాని ఇక్కడి గిరిజనులు అంటున్నారు. ఏటికేడు ఎగుమతులు పెరుగుతున్నాయని, ఇది మన్యం ప్రాంతానికి లభించిన గౌరవమని వారు మురిసిపోతున్నారు. కాగా అమితాబ్ కాంత్ ట్వీట్‌కు స్పందించిన ఆనంద్ మహీంద్ర దేశ విజయాన్ని ప్రతిబింబించేలా ఈ కాఫీ రకాన్ని ఎంచుకోవడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.
A perfect epicurean choice, @amitabhk87 whixh showcases an incredible Indian success story. The creation of a global brand while simultaneously transforming the lives of the tribal population of Araku. https://t.co/oFHWz0EIzy
— anand mahindra (@anandmahindra) July 16, 2023