https://oktelugu.com/

రియల్ బాషా…పోలీస్ బెటాలియన్ మొత్తం దండం పెట్టారు!

బాషా సినిమాలో రజినీ కాంత్ పాత్ర ఎలివేషన్ చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావలసిందే. అజ్ఞాతంలో ఉన్న రజినీ గురించి అసలు విషయం తెలుసుకున్న బడాబాబులు కూడా చేతులు జోడిస్తుంటే… కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులకు చెప్పలేని అనుభూతి కలుగుతుంది. బాషా మూవీలో లాంటి సన్నివేశాలు రియల్ లైఫ్ లో జరిగితే… ఊహించడానికే కష్టంగా ఉన్నా ఇది జరిగింది. మధ్యప్రదేశ్ కి చెందిన అలోక్ సాగర్ స్టోరీ వింటే, బాషా సినిమాలో రజినీ కూడా సరిపోడనిపిస్తుంది. Also Read: […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 23, 2020 / 07:33 PM IST
    Follow us on


    బాషా సినిమాలో రజినీ కాంత్ పాత్ర ఎలివేషన్ చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావలసిందే. అజ్ఞాతంలో ఉన్న రజినీ గురించి అసలు విషయం తెలుసుకున్న బడాబాబులు కూడా చేతులు జోడిస్తుంటే… కుర్చీలో కూర్చున్న ప్రేక్షకులకు చెప్పలేని అనుభూతి కలుగుతుంది. బాషా మూవీలో లాంటి సన్నివేశాలు రియల్ లైఫ్ లో జరిగితే… ఊహించడానికే కష్టంగా ఉన్నా ఇది జరిగింది. మధ్యప్రదేశ్ కి చెందిన అలోక్ సాగర్ స్టోరీ వింటే, బాషా సినిమాలో రజినీ కూడా సరిపోడనిపిస్తుంది.

    Also Read: కొత్త కరోనా ఎఫెక్ట్.. కర్ణాటకలో కర్ఫ్యూ అమల్లోకి..!

    మధ్యప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో టైట్ సిట్యుయేషన్ నడుస్తుంది. ఎన్నికల ప్రశాంతంగా నడపటం కోసం… పోలీసులు టైట్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో తెల్లని గడ్డం, బక్క చిక్కిన శరీరం కలిగిన ఓ వృద్ధుడు చొక్కా కూడా లేకుండా సైకిల్ పై వస్తున్నాడు. ఎటువంటి బెరుకు లేకుండా తిరుగుతున్న ఆయన్ని చూసిన పోలీస్ అధికారి, అతను ఎవరని స్థానికులను అడిగారు. అతని పేరు అలోక్ సాగర్… మా ఊరిలోనే ఉంటాడు, అంతకు మించి మాకు ఏమీ తెలియదని అన్నారు. అలోక్ సాగర్ పై అనుమానంతో ఆ పోలీస్ అధికారి అతన్ని స్టేషన్ కి తీసుకెళ్లాడు. పోలీస్ అధికారి నీవు ఎవరు, ఎక్కడి వాడివి అని అడిగారు. దానితో నాపేరు అలోక్ సాగర్, నేను భారతీయుడినే అని ఆ వృద్ధుడు సమాధానం చెప్పాడు. నీ ఐడి కార్డు చూపించమని పోలీస్ అడిగారు. నేను ఐడి కార్డు తెచ్చుకోలేదు అని అలోక్ సమాధానం చెప్పారు.

    ఏదో తేడాగా ఉన్నాడని భావించిన పోలీస్ అధికారి నువ్వు అనుమాస్పదంగా ఉన్నావు, నిన్ను అరెస్ట్ చేస్తున్నా అన్నాడు.దీనితో కోపానికి గురైన అలోక్… నేను ఢిల్లీ ఐ ఐ టి రిటైర్డ్ ప్రొఫెసర్ ని, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ రాజన్ నా శిష్యుడు… కావాలంటే ఎంక్వయిరీ చేసుకో అని అక్కడి నుండి వెళ్లిపోయారు. పోలీసులు అలోక్ సాగర్ గురించి ఎంక్వయిరీ చేయగా, ఆయన గురించి షాకింగ్ నిజాలు తెలిశాయి. వెంటనే అలోక్ ఇంటికి పోలీస్ బెటాలియన్ మొత్తం కదలి వెళ్లి మరీ అతనికి క్షమాపణలు చెప్పారు.

    Also Read: 2020లో రూ.20 వేల లోపు టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే..!

    దేశంలోనే టాప్ 5 ఐ ఐ టి ప్రొఫెసర్స్ లో ఒకరైన అలోక్ సాగర్ రిటైర్డ్ అయిన తర్వాత మధ్యప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామంలో జీవిస్తున్నారు. ఆడంబరాలకు దూరంగా ప్రకృతిలో నిరాడంబర జీవితం గడుపుతున్నారు. అమెరికా హూస్టన్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన అలోక్ సాగర్ అక్కడ అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. స్టూడెంట్స్ కి బోధనలు చేశారు. ఒక ప్రొఫెసర్ గా కెరీర్ లో అనేకమంది మేధావులను అలోక్ సాగర్ తయారు చేశారు.