Homeఅప్పటి ముచ్చట్లుఆ డ్రెస్ వల్లే.. గొప్ప హాస్య నటుడయ్యారు !

ఆ డ్రెస్ వల్లే.. గొప్ప హాస్య నటుడయ్యారు !

Padmanabhamసినిమా లోకం భలే విచిత్రంగా ఉంటుంది. సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తోన్న వారి కంటే కూడా.. సినిమాలో నటించాలి అనే ఆలోచన కూడా లేని వారి దగ్గరకే సినిమా ఛాన్స్ వెతుక్కుంటూ వెళ్తుంది. అంతెందుకు సినిమాల్లో గొప్ప పేరుప్రఖ్యాతలు సంపాదించిన అనేకమంది గొప్ప నటీనటుల్లో చాలామంది అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించిన వారే. హాస్య నటుడు పద్మనాభం ‘రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌’ నాటక సంస్థను స్థాపించి ‘శాంతి నివాసం’ నాటకాన్ని ప్రదర్శిస్తున్న రోజులవి.

నిజానికి అప్పటికి పద్మనాభంకు సినిమాల్లో నటించాలి అనే ఆలోచన కూడా లేదు. అయితే, ఓ రోజు మద్రాసుకు వచ్చిన డ్రామా కాంట్రాక్టర్లకు పద్మనాభం, సినిమా స్టూడియోలు చూపిస్తూ వాహినీలోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో అక్కడ ‘వెలుగు నీడలు’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలోని ‘భలే భలే మంచి రోజులులే..’ పాటను ఏయన్నార్‌ పై చిత్రీకరణ చేస్తున్నారు. ఆ పాటలో అప్పటి హాస్యనటుడు సారథి కూడా ఉంటారు. అయితే సారథి వరసగా టేకులు తినడంతో నిర్మాత దుక్కిపాటికి విసుగెత్తుకొచ్చింది.

ఒకపక్క సమయం దాటిపోతుంది. మరోపక్క అనవసరంగా రీల్ ఖర్చు పెరిగిపోతుంది. ఎటు చూసినా నిర్మాతకు నష్టమే కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చాడు పద్మనాభం. ఐతే పద్మనాభం మంచి ఆర్టిస్ట్ అనే వియషం అప్పటికీ నిర్మాత దుక్కిపాటికి తెలియదు అట. కానీ ఆశ్చర్యకరంగా ఎందుకో పద్మనాభంను చూస్తూనే ‘నువ్విప్పుడు వేసుకున్న డ్రెస్‌ బాగుంది. వెంటనే మేకప్‌ చేయించుకో, నువ్వు ఆ పాత్ర చేయగలవు అనిపిస్తోంది’ అంటూ సారథి పాత్రలో పద్మనాభాన్ని తీసున్నారు నిర్మాత దుక్కిపాటి. కేవలం డ్రెస్ కామెడీగా ఉండటం చూసి ఆయన ఛాన్స్ ఇచ్చాడట.

ఆ విధంగా ‘కర్నూలు ఎక్కడ, కాకినాడ ఎక్కడ…’ అంటూ ఆరంభమయ్యే సాకీని పద్మనాభం మీద చిత్రించడం జరిగింది. పద్మనాభం కూడా సింగిల్ టేక్ లో నటించడం మొత్తానికి అలా తెలుగు సినిమాకి గొప్ప హాస్య నటుడు పరిచయం అయ్యాడు. ఆ పాటే పద్మనాభంకు గుర్తింపును తీసుకొచ్చింది. అప్పటి చలనచిత్ర హాస్యనట చక్రవర్తిగా ఆయన జీవితానికి గట్టి పునాదులు వేసింది ఆ పాట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Oktelugu Epaper
Exit mobile version