కరోనా విలయ తాండవం.. 1341 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. మూడో రోజు కూడా అదే వరుస కొనసాగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 14.95 లక్షల టెస్టులు చేయగా.. 2,34,692 కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. దంతో ఇప్పుడు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. కొత్తగా 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య […]

Written By: Srinivas, Updated On : April 17, 2021 1:57 pm
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. మూడో రోజు కూడా అదే వరుస కొనసాగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 14.95 లక్షల టెస్టులు చేయగా.. 2,34,692 కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. దంతో ఇప్పుడు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది.

కొత్తగా 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220కి చేరింది. మొత్తంగా రికవరీ రేటు 87.80 శాతంగా ఉంది. మరోవైపు .. దేశంలో మరణాలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజులుగా రోజుకు వెయ్యికి పైగా మంది చనిపోతూనే ఉన్నారు. తాజాగా.. 1341 మంది వైరస్‌తో పోరాడుతూ చనిపోయారు.

దేశంలో సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటి సారి. మొదటి దశ కోవిడ్‌లో సెప్టెంబరులో ఒకరోజు అత్యధికంగా 1200 మంది చనిపోయారు. మొత్తంగా ఇప్పుడు దేశంలో కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య 1,75,649కి చేరింది. అంతేకాదు.. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక.. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దేశంలో వేగవంతం చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది. శుక్రవారం మొత్తంగా 30.04 లక్షల మందికి పైగా టీకా వేయగా.. ఇప్పటివరకు టీకా తీసుకున్న వరి సంఖ్య 11.99 కోట్లకు చేరుకుంది.

మరోవైపు.. మహారాష్ట్రలో మహా స్పీడ్‌లో కరోనా వైరస్‌ దూసుకెళ్తోంది. నిన్న ఒక్కరోజు 61,695 కేసులు వచ్చాయి. 349 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అటు ఢిల్లీలోనూ 16,699 కేసులు నమోదు కాగా.. 112 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా హాస్పిటల్స్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ప్రధాని మోడీ సమీక్షించారు. డిమాండ్‌కు అనుగుణంగా ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. ఆక్సిజన్‌ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం షిఫ్టుల వారీగా పనిచేయాలని కోరారు.