Homeఅప్పటి ముచ్చట్లుMikkilineni Radhakrishna Murthy: నష్టజాతకుడన్నారు.. కానీ గర్వకారణంగా ఎదిగాడు !

Mikkilineni Radhakrishna Murthy: నష్టజాతకుడన్నారు.. కానీ గర్వకారణంగా ఎదిగాడు !

Mikkilineni Radhakrishna Murthy: తెలుగు సినిమా నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన పేరులోనే వ్యంగ్యం ఉంది, ఇక ఆయన మాట విరుపులోనే హాస్యం మిళితమై ఉంది. తెలుగు కళామతల్లి పాదాలకు పారాణిలా తమకంటూ ప్రత్యేక గుర్తులను మిగుల్చుకున్న మహానటుల్లో ఆయనొకరు. ఆయనే ‘మిక్కిలినేని’. అసలు పేరు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి తెలుగు రంగస్థల, సినిమా నటుడిగా, రచయితగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.

Mikkilineni Radhakrishna Murthy
Mikkilineni Radhakrishna Murthy

మొదట్లో మిక్కిలినేని పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించిన గొప్ప వ్యక్తి మిక్కిలినేని. గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు మిక్కిలినేని. కాగా మిక్కిలినేని ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో కూడా ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు.

Also Read:  బీజేపీ, టీడీపీలకు జనసేన ఆవిర్భావ దినోత్సవం ‘మార్చి 14’ టెన్షన్

తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను ‘నటరత్నాలు’ శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు. 1949లో ‘కేఎస్ ప్రకాశ రావు’ తీసిన ‘దీక్ష’ సినిమాతో మొదలై బాలకృష్ణ హీరోగా వచ్చిన భైరవద్వీపం సినిమా వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో ఆయన నటించారు.

అయితే, మీకు తెలుసా ? మిక్కిలినేని చిన్నతనంలోనే ఎన్నో అవమానాలు అనుభవించారు. ఆయనను అయినవాళ్లు నష్టజాతకుడన్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా కోలవెన్నులో అమ్మమ్మ గారి ఇంట ఆయన బాల్యం కష్టంగా గడిచింది. కానీ చివరకు ‘మిక్కిలినేని’ ఇంటి పేరు గల వారికి గర్వకారణంగా ఎదిగారు.

Mikkilineni Radhakrishna Murthy
Mikkilineni Radhakrishna Murthy

ఇక ఫిబ్రవరి 22, 2011 తేదీన మంగళవారం తెల్లవారు జామున సుమారు మూడు గంటలకు మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు. కాగా సినీజీవితంలో ప్రవేశించేముందు మిక్కిలినేని వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఆయన కుమారుడు డా.విజయకుమార్ వెటర్నరీ వైద్యులుగా పదవీ విరమణ చేయడం గమనార్హం. ఏది ఏమైనా ‘మిక్కిలినేని’ లాంటి వైవిధ్యమైన నటుడ్ని ఈ రోజుల్లో మనం చూడలేం.

Also Read:  రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొడుతున్న ప్రభాస్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

  1. […] Revanth Reddy- Jagga Reddy:  కాంగ్రెస్ పార్టీలో అస‌మ్మ‌తి పెరుగుతోంది. జ‌గ్గారెడ్డి,వీహెచ్ లు త‌మ‌ను పార్టీ కోవ‌ర్టులుగా చిత్రీక‌రిస్తున్నారంటూ విభేదిస్తున్నారు. దీంతో పార్టీకి గుడ్ బై చెప్పాల‌ని చూస్తున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో వారిలో అస‌మ్మ‌తి క్ర‌మంగా పెరుగుతోంది. దీంతో ఇక పార్టీలో ఉండ‌లేమ‌ని చెబుతున్నారు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకున్నా అవి ఫ‌లించ‌డం లేదు. మూడు రోజులుగా జ‌గ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ త‌న నిర్ణయంలో మార్పు ఉండ‌ద‌ని చెబుతున్నారు. […]

Comments are closed.

Exit mobile version