Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak vs RRR: 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'భీమ్లానాయకే'.. కానీ నిరాశలో...

Bheemla Nayak vs RRR: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘భీమ్లానాయకే’.. కానీ నిరాశలో ఫ్యాన్స్ !

Bheemla Nayak vs RRR: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమా ట్రైల‌ర్ ప్రస్తుతం యూట్యూబ్‌ ను షేక్ చేస్తోంది. విడుద‌లైన 12 గంట‌ల్లోనే ఈ ట్రైల‌ర్ 8 మిలియ‌న్ వ్యూస్‌ ను క్రాస్ చేసింది. 1 మిలియన్ (10 లక్షల) లైక్స్ వచ్చాయి. తక్కువ టైంలో ఎక్కువ లైక్స్ వచ్చిన రెండో తెలుగు సినిమా ఇదే. ‘ఆర్ఆర్ఆర్’కు 7 గంటల 43 ని.ల్లో 1 మిలియన్ లైక్స్ రాగా, దీనికి 13 గంటల 28 ని.ల్లో 1 మిలియన్స్ లైక్స్ వచ్చాయి.

Bheemla Nayak vs RRR
Pawan Kalyan Bheemla Nayak

అయితే, షాకింగ్ విషయం ఏమిటంటే.. భీమ్లానాయక్ ట్రైలర్‌ పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కొందరు నిరాశగా ఉన్నారు. ట్రైలర్ నీరసంగా ఉందని, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ బాగుంటే ట్రైలర్ దద్దరిల్లిపోయేదంటున్నారు. దీని పై తమన్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ‘అన్ని ట్రైలర్‌ లోనే ఎక్స్‌పెక్ట్ చేస్తే ఎలా అమ్మా.. థియేటర్స్‌లో ర్యాంప్ అమ్మా.!! ఫారెస్ట్ ఫైర్‌ కు, లోకల్ ఫైర్‌ కు తేడా ఉండాలిగా!! కలుద్దాం’ అని ట్వీట్ చేశాడు.

Also Read: Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్ సునామీ.. రికార్డులు చెరిపేస్తూ ఊచకోత

ఇక భీమ్లానాయక్ ట్రైలర్‌ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ట్రైలర్ చూసిన తర్వాత #BheemlaNayak అని కాకుండా #DanielShekhar అని పిలవాలనిపిస్తోంది. రానా దగ్గుపాటిని ప్రమోట్ చేసేందుకు మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించారు.
Ram Gopal Varma Counter Comments On Pawan Kalyan Bheemla Nayak Trailer || Bheemla Nayak Records

దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా నేను చాలా బాధపడ్డాను’ అని ఆర్జీవీ కామెంట్ చేశాడు. మరి ఆర్జీవీ ఈ ట్వీట్ కేవలం కావాలనే చేశాడని అర్ధం అవుతుంది. అయినా ఆర్జీవీ కామెంట్స్ పై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read: Bheemla Nayak Trailer: జాతర చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌.. కళ్ల ముందే అగ్నిగోళం

Recommended Video:

#BheemlaNayak Trailer Review | Pawan Kalyan | Rana Daggubati | Trivikram | Saagar K Chandra

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Prabhas Salaar Movie Budget: కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇప్పుడు ఈ సినిమా గురించే హాట్ టాపిక్. ఈ మూవీకి సంబంధించిన బడ్జెట్ మొదట అనుకున్నదాని కంటే భారీగా పెరిగిపోయింది. సుమారు రూ.200 కోట్లకు పైనే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నారని టాక్. […]

Comments are closed.

Exit mobile version