Film Stars Parties : సినిమాలు రాజకీయాలు వేరు కాదు. ఒకదానితో మరొకదానికి సంబంధం ఉంటుంది. సినిమాల నుంచి రాజకీయాల వైపు వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. మన తెలుగు నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు కూడా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం తొమ్మది నెలల్లోనే అధికారం చేపట్టడం మామూలు విషయం కాదు. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
Also Read: ప్రముఖ నటుడు సూర్యపై పరువు నష్టం దావా కేసు
అదే సమయంలో తమిళనాడులో కూడా సినిమా వారు రాజకీయాల్లో రాణించిన సందర్భాలున్నాయి. ఎన్టీఆర్ కు సమకాలీన నటుడు ఎంజీ రామచంద్రన్ కూడా అక్కడ తన ప్రభావం చూపించి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జయలలిత కూడా దాదాపు పదమూడేళ్లు సీఎంగా చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు రాజకీయాల్లో కూడా రాణించి సినిమా వారి విలువేంటో నిరూపించారు.
చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి చేయి కాల్చుకున్నారు. కేవలం 18 స్థానాలు గెలుచుకున్నా తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్లీ సినిమాల వైపు మళ్లారు. ఇక తమ్ముడు పవన్ కల్యాణ్ సైతం 2014లో జనసేన పార్టీ స్థాపించినా ప్రజల్లో ప్రాచుర్యం పొందలేదు. ఫలితంగా ఓటమి చవిచూసినా ప్రస్తుతం ఏపీలో తన ప్రభావం చూపించాలని తాపత్రయ పడుతున్నారు.
ఇంకా వీరే కాకుండా తమిళంలో కమల్ హాసన్ కూడా గత ఎన్నికల్లో పార్టీ స్థాపించి పోటీలో నిలిచినా ఎక్కడ కూడా విజయం సాధించక దుకాణం మూసుకున్నారు. ఇదే కోవలో విజయకాంత్, కార్తీక్, విజయ్ లాంటి వారు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుని ఫెయిలయ్యారు. కానీ సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: హీరో కావాల్సిన వ్యక్తి మోహన్ బాబు వల్ల బస్సు ట్రావెల్స్ నడిపి కోటీశ్వరుడయ్యాడు.. ఎవరంటే?