Homeఅప్పటి ముచ్చట్లుఅదే ఆయనకు లేడీస్ లో క్రేజ్ ను పెంచింది !

అదే ఆయనకు లేడీస్ లో క్రేజ్ ను పెంచింది !

సోగ్గాడిగా అలనాటి ‘అందాల హీరో శోభన్‌బాబు’ అప్పటి మహిళా లోకానికి కలలు రాకుమారుడిగా వెలిగిపోతోన్న కాలం అది. నిజానికి అప్పట్లో చాలామంది హీరోలకు అందం ఉంది. కానీ, అందానికి పర్యాయపదం అంటే శోభన్‌బాబునే అన్నట్టు అప్పటి మీడియా కూడా బాగా ప్రాజెక్ట్ చేసింది. దానికి తగ్గట్టు లేడీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తో ఎవ్వరికీ సాధ్యం కానీ కీర్తిని సంపాధించుకున్నాడు శోభన్‌బాబు. పైగా ఆయన సినిమాలు కూడా ఎక్కువుగా మహిళల మనోభావాల మీదే నడిచేవి. ఆయనను ప్రేమించిన […]

Sobhan Babuసోగ్గాడిగా అలనాటి ‘అందాల హీరో శోభన్‌బాబు’ అప్పటి మహిళా లోకానికి కలలు రాకుమారుడిగా వెలిగిపోతోన్న కాలం అది. నిజానికి అప్పట్లో చాలామంది హీరోలకు అందం ఉంది. కానీ, అందానికి పర్యాయపదం అంటే శోభన్‌బాబునే అన్నట్టు అప్పటి మీడియా కూడా బాగా ప్రాజెక్ట్ చేసింది. దానికి తగ్గట్టు లేడీస్ లో తిరుగులేని ఫాలోయింగ్ తో ఎవ్వరికీ సాధ్యం కానీ కీర్తిని సంపాధించుకున్నాడు శోభన్‌బాబు. పైగా ఆయన సినిమాలు కూడా ఎక్కువుగా మహిళల మనోభావాల మీదే నడిచేవి. ఆయనను ప్రేమించిన హీరోయిన్లు.. చివరకు ఆయన కోసం త్యాగమూర్తులుగా మారే కథాంశాలే శోభన్ బాబు సినిమాల్లో ఎక్కువుగా కనిపించేది. అదే ఆయనకు లేడీస్ లో క్రేజ్ ను పెంచింది.

అయితే శోభ‌న్‌బాబు తన శైలికి భిన్నంగా కూడా కొన్ని అపురూపమైన చిత్రాల్లో నటించారు. అలాంటి చిత్రాల్లో ముఖ్యంగా శోభ‌న్‌బాబు న‌టించి మెప్పించిన చిత్రం ‘చెల్లెలి కాపురం’ సినిమా కూడా ఒకటి. ఒక విధంగా ఈ సినిమా శోభన్ బాబు మొదట చేయదల్చుకోలేదు. కానీ కథ ఆయనకు బాగా నచ్చింది. కాకపోతే అందాల హీరో అనే త‌న‌కున్న క్రేజీ ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి.. మొదటిసారి డీ గ్లామరైజ్డ్ రోల్ ‌లో ఈ సినిమా కోసం నటించాలి. తేడా కొడితే అసలుకే మోసం వస్తోంది. అయితే ఆయన గొప్ప సాహసం చేశారు. ఆ రోజుల్లో ఈ సినిమా పోస్టర్ లో డీ గ్లామరైజ్డ్ లుక్ లో శోభన్ బాబును చూసి.. ఆయన మహిళా అభిమానులు పెదవి విరిచారు కూడా.

అయినప్పటికీ ఆయన ఆ పోస్టర్స్ నే రాష్ట్రంలో ప్రతి చోట అంటించేలా చూశారు. ఎందుకు రిస్క్ అని కొంతమంది అన్నా.. నేను ఈ సినిమా చేసిందే మహిళల గొప్పతనం చెప్పడానికి.. అలాంటిది వారే ఈ సినిమా చూడకపోతే ఎలా..? అందుకే వాళ్ళు ఈ సినిమా చూడాలి అని ఎక్కువ పబ్లిసిటీ చేయించారు. మహిళలు సినిమా చూసారు, ఎప్పటిలాగే ఆ పాత్రలో శోభన్ బాబును వాళ్ళు ఆరాధించారు. పైగా ఆయన ఆ సినిమా ఎందుకు చేశారో అర్ధం చేసుకున్న మహిళా అభిమానులు ఆయనను ఇంకా అభిమానించారు. అది కూడా ఆయనకు లేడీస్ లో క్రేజ్ ను పెంచింది.

అయితే తన జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినవి కాబట్టే.. ఆయన వయసు అయిపోయాక చివరి రోజుల్లో బయట ప్రపంచానికి తనలోని ముసలితనాన్ని చూపించడానికి ఇష్టపడలేదని అంటుంటారు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు. ఏది ఏమైనా మహిళల హీరోనే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper