మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు దేవుడికి కానుకగా పదో, పాతికో సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి భక్తుడు కానుకలను సమర్పించి ఆ దేవుడికి నమస్కరించుకుని వస్తుంటారు. మరికొంత మంది భక్తులు దేవుడిని పెద్ద కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు నెరవేరిన తరువాత స్వామివారికి పెద్ద ఎత్తున కానుకలను సమర్పిస్తుంటారు. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు వెండి, బంగారు ఆభరణాలతో పాటు,ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి వాటిని దేవుడికి కానుకగా సమర్పిస్తుంటారు. అయితే దేవుడికి కానుకలుగా ఎలాంటి వస్తువులు సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా చాలా మందికి ఆలయాలకు ఎటువంటి కానుకలను సమర్పించాలో అవగాహన ఉండదు. కొంతమంది ఆలయంలో ఉన్న గోడలకు సున్నం వేయించి ఆలయ ప్రాంగణాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. అలాంటి వారికి శ్రీ మహావిష్ణువు లోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆలయానికి శంఖం దానం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. తరువాత మానవ జన్మ ఎత్తవలసి వచ్చిన కూడా వారు ఎంతో కీర్తి వంతులుగా జన్మిస్తారని పండితులు చెబుతున్నారు.
అదేవిధంగా దేవాలయానికి గంటను దానం చేసేవారి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. మరి కొందరు మువ్వలను, గజ్జలను దానం చేయడం వల్ల సౌభాగ్యాన్ని పొందుతాడు. ఆలయానికి సందర్శించే భక్తుల కోసం కొందరు ఆలయ ప్రాంగణంలో పందిళ్లను నిర్మిస్తుంటారు. అలాంటివారికి ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతాయి. దేవుడికి ఆసనాన్ని సమర్పించిన వారికి సర్వత్ర ఉత్తమ స్థానం లభిస్తుందని,ఈ విధంగా భక్తులు దేవుడికి కానుకలుగా సమర్పించడం వల్ల ఈ ఫలితాలను పొందవచ్చునని పండితులు చెబుతున్నారు.