డీజీపీ సవాంగ్.. కాచుకో ఇక.. సోము వీర్రాజు వార్నింగ్

ఏపీలో విగ్రహ రాజకీయం పతాక స్థాయికి చేరింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విగ్రహాల విధ్వంసం ఘటనలో బీజేపీ, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని దర్యాప్తులో తేలిందని డీజీపీ చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ భగ్గుమంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంలో ఏకంగా డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు. Also Read: త్యాగం ఎవ్వరిది? […]

Written By: NARESH, Updated On : January 17, 2021 10:54 am
Follow us on

ఏపీలో విగ్రహ రాజకీయం పతాక స్థాయికి చేరింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విగ్రహాల విధ్వంసం ఘటనలో బీజేపీ, టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని దర్యాప్తులో తేలిందని డీజీపీ చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ భగ్గుమంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంలో ఏకంగా డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు.

Also Read: త్యాగం ఎవ్వరిది? భోగం ఎవ్వరిది ?

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ డీజీపీకి సంచలన లేఖ రాశారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారంటూ చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సాక్ష్యాధారాలు ఉంటే బయటపెట్టాలని.. బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ ప్రజలను పక్కదారి పట్టించేలా వారికి తప్పుడు సమాచారం చేరవేసేలా ప్రకటనలు జారీ చేయడం సరికాదని సోము వీర్రాజు హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త ప్రమేయం ఆలయాలపై దాడుల్లో లేదని లేఖలో సోము వీర్రాజు స్పష్టం చేశారు.

దాడులపై ప్రశ్నించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు నెపాన్ని నెట్టి తప్పించుకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. సమస్యను లేవనెత్తితే వారే విధ్వంసానికి పాల్పడినట్టు కాదని హితవు పలికారు.

Also Read: గ్రేటర్ లొల్లి మళ్లీ మొదలైనట్టే.. మేయర్ ఎవరికి.?

రాష్ట్రంలో ఆలయాలు, విగ్రహాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దారుణంగా విఫలమయ్యారని సోము వీర్రాజు ఆరోపించారు. పోలీసుల వైఫల్యం వల్లే రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని లేఖలో సోము వీర్రాజు పేర్కొన్నారు. వాటికి రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.

అధికార వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఆలయాలపై దాడులను అరికట్టలేకపోతోంది. ఏదో ఒక గ్రామంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ప్రతిపక్షాలైన బీజేపీ, జనసేనలు బలంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. కాపు కాయాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పోలీసులు బీజేపీ నేతలనే ఈ దాడుల వెనుక ఉన్నారని తప్పించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా గట్టిగా నిలదీశాడు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్