https://oktelugu.com/

కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. ఏకంగా 2.5 లక్షల తగ్గింపు..?

మనలో చాలామందికి కారు కొనాలనే ఆశ ఉంటుంది. కారును స్టేటస్ సింబల్ గా భావించే వాళ్లు సమాజంలో చాలామంది ఉన్నారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు ఉండటంతో చాలామంది కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పండగ సీజన్ కావడంతో పలు కంపెనీలు కార్లపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ మన దేశంలో కారు కొనాలనుకునే వారికి తీపి కబురు చెప్పింది. గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో హోండా కార్స్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 10, 2020 / 09:21 AM IST
    Follow us on

    మనలో చాలామందికి కారు కొనాలనే ఆశ ఉంటుంది. కారును స్టేటస్ సింబల్ గా భావించే వాళ్లు సమాజంలో చాలామంది ఉన్నారు. త్వరలో దసరా, దీపావళి పండుగలు ఉండటంతో చాలామంది కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. పండగ సీజన్ కావడంతో పలు కంపెనీలు కార్లపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ మన దేశంలో కారు కొనాలనుకునే వారికి తీపి కబురు చెప్పింది.

    గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో హోండా కార్స్ పండగ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. హోండా కార్స్ ఎవరైతే కార్లను కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటారో వారికి చాలా ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. హోండా డీలర్‌షిప్స్ దగ్గర కొత్త కార్లను కొనుగోలు చేసేవాళ్లు సులువుగా ఆఫర్లను పొందే అవకాశం ఉంటుంది. హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ సేల్స్ డైరెక్టర్ ఈ విషయాలను వెల్లడించారు.

    కరోనా వైరస్ విజృంభణ వల్ల దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని ఈ ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈజీ ఈఎంఐ, ఎక్కువ కాలం టెన్యూర్, స్మార్ట్ ఫైనాన్స్ లాంటి ఆప్షన్లను సైతం అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.

    హోండా సివిక్ కారుపై ఏకంగా 2.5 లక్షల రూపాయల తగ్గింపు లభిస్తుందని.. హోండా అమేజ్ కారుపై 47 వేల రూపాయలు, హోండా జాజ్ కారుపై 40 వేల రూపాయలు, హోండా సిటీ 5 జనరేషన్ కారుపై 30 వేల రూపాయల తగ్గింపు పొందవచ్చని సమాచారం. కారు ధరకు కొన్ని ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు 100 శాతం ఫైనాన్స్ సమకూరుస్తాయి. ఎక్స్చేంజ్ డిస్కౌంట్, హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, ఎక్స్‌టెండెంట్ వారంటీ, క్యాష్ డిస్కౌంట్ రూపంలో తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది.