విశాఖలో సామాన్యుడికి షాక్.. లక్షన్నర కరెంట్ బిల్లు..?

ఈ మధ్య కాలంలో కరెంట్ మీటర్లలోని లోపాలు సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎవరో చేసిన తప్పుల వల్ల సామాన్యులపై లక్షల రూపాయల భారం పడుతోంది. లక్షల్లో వచ్చిన బిల్లును ఎలా చెల్లించాలో తెలియక పలు ప్రాంతాల్లోని సామాన్యులు తల పట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా విశాఖలో సామాన్యుడికి ముట్టుకోకుండానే కరెంట్ షాక్ తగిలింది. 1,40,248 రూపాయల బిల్లును చూసి ఖంగు తినడం విశాఖలోని గెమ్మెల కృష్ణారావు వంతయింది. పూర్తి వివరాల్లోకి వెళితే గెమ్మెలి కృష్ణారావు అనే […]

Written By: Navya, Updated On : October 10, 2020 10:27 am
Follow us on

ఈ మధ్య కాలంలో కరెంట్ మీటర్లలోని లోపాలు సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎవరో చేసిన తప్పుల వల్ల సామాన్యులపై లక్షల రూపాయల భారం పడుతోంది. లక్షల్లో వచ్చిన బిల్లును ఎలా చెల్లించాలో తెలియక పలు ప్రాంతాల్లోని సామాన్యులు తల పట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా విశాఖలో సామాన్యుడికి ముట్టుకోకుండానే కరెంట్ షాక్ తగిలింది. 1,40,248 రూపాయల బిల్లును చూసి ఖంగు తినడం విశాఖలోని గెమ్మెల కృష్ణారావు వంతయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే గెమ్మెలి కృష్ణారావు అనే వ్యక్తి విశాఖలోని పాడేరు శివారు ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఈ నెలలో అతని ఇంటికి 1,40,248 రూపాయల బిల్లు రావడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ప్రతి నెల తన ఇంటికి 500 రూపాయలకు అటూఇటుగా కరెంట్ బిల్లు వచ్చేదని.. తక్షణమే కరెంట్ బిల్లు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని గతంలో కూడా ఇలాంటి చేదు అనుభవం తనకు ఎదురైందని కృష్ణారావు చెప్పుకొచ్చారు. గతంలో తన ఇంటికి 1,39,848 రూపాయల బిల్లు రాగా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి మీటర్ ను రద్దు చేయించుకున్నానని కృష్ణారావు వెల్లడించాడు. మీటర్ మార్చిన కొన్ని నెలలు తకువ మొత్తం బిల్లు వచ్చినా తాజాగా మరోసారి చేదు అనుభవం ఎదురైందని కృష్ణారావు చెప్పుకొచ్చారు.

ఐటీడీఏ పీవోకు బాధితుడు ఎక్కువ మొత్తంలో వచ్చిన కరెంట్ బిల్లు గురించి ఫిర్యాదు చేశాడు. తనకు పెద్దమొత్తంలో కరెంట్ బిల్లు రావడానికి అసలు కారణం కనుక్కోవాలని కోరాడు. తాను అంత మొత్తం బిల్లును చెల్లించలేనని.. తనకు న్యాయం చేయాలని బాధితుడు అధికారులను వేడుకున్నాడు. దీంతో అధికారులు బిల్లును, మీటర్ ను పరీక్షించి బాధితుడి తప్పు లేకపోతే న్యాయం చేస్తామని చెబుతున్నారు.