Akhanda Day 35 Collections: అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చిన నటసింహం బాలయ్య అఖండ సినిమా మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఐదో వారంలో కూడా ఇంకా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా లాభాల్లోనే నడుస్తోంది.
నిజానికి కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. దాంతో తెలుగు సినిమాకి కరోనా అనంతరం సాలిడ్ హిట్ పడలేదు. బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది.
ఈ చిత్రం 35 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం 20.50 కోట్లు
వెస్ట్ 3.96 కోట్లు
గుంటూరు 4.78 కోట్లు
కృష్ణా 3.60 కోట్లు
నెల్లూరు 2.63 కోట్లు
సీడెడ్ 15.50 కోట్లు
ఉత్తరాంధ్ర 6.22 కోట్లు
ఈస్ట్ 4.18 కోట్లు
Also Read: నిజమైన ఇండియన్ స్టార్ ఆమె మాత్రమే !
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 61.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 10.30 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 71.60 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
‘అఖండ’ సినిమాకు రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తమ్మీద ఈ చిత్రం 5 వారాలు పూర్తయ్యేసరికి రూ. 71.60 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ. 17.60 కోట్ల లాభాలు దక్కాయి. పైగా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు లాభాలు వచ్చాయి.
Also Read: ఛాన్స్ కోసమే రాశి ఖన్నా ఆతనితో డేటింగ్ ?