ఒక్క సీటు గెలిచిన పవనా మాట్లాడేది.. గాలితీసిన అన్నా రాంబాబు

దేనికైనా సరే గెలుపే ప్రామాణికం.. ఆ గెలుపు చూసే నేతలను అంచనా వేస్తుంటారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కాక రేపే మాటలు మాట్లాడిన ఆయన గెలుపు శాతాన్ని బయటకు తీస్తే అవమానాలే కనిపిస్తాయి. Also Read: వింతవ్యాధి కలకలం.. అందుకే ఇప్పుడు ఏపీలో విస్తృతంగా పర్యటిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శ ఒకటే. కనీసం నువ్వు పోటీచేసిన రెండు చోట్ల గెలవలేదు.. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను […]

Written By: NARESH, Updated On : January 25, 2021 4:57 pm
Follow us on

దేనికైనా సరే గెలుపే ప్రామాణికం.. ఆ గెలుపు చూసే నేతలను అంచనా వేస్తుంటారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కాక రేపే మాటలు మాట్లాడిన ఆయన గెలుపు శాతాన్ని బయటకు తీస్తే అవమానాలే కనిపిస్తాయి.

Also Read: వింతవ్యాధి కలకలం..

అందుకే ఇప్పుడు ఏపీలో విస్తృతంగా పర్యటిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్ పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శ ఒకటే. కనీసం నువ్వు పోటీచేసిన రెండు చోట్ల గెలవలేదు.. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేదు.. నువ్వా మాకు చెప్పేది అని నిలదీస్తుంటారు.

తాజాగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన పవన్ కు అదే ప్రశ్న ఎదురైంది. గిద్దలూరు నియోజకవర్గంలోని సింగరపల్లిలో ఆత్మహత్య చేసుకున్న జనసేన పార్టీ కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని ఇటీవల పరామర్శించిన జనసేనాని పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు అన్నా రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తాను తిట్టడం వల్లే వెంగయ్య చనిపోలేదని కుటుంబం అంటున్నా నువ్వే రాద్ధాంతం చేస్తున్నావ్ పవన్ అంటూ అన్నా రాంబాబు విమర్శలు గుప్పించారు.

Also Read: ఏపీ ‘పంచాయితీ’ లొల్లి.. సుప్రీంకోర్టులో సంచలన పరిణామం

ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జగన్ తర్వాత ఏపీలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన నన్ను.. రెండు చోట్ల పోటీచేసి గెలవని నువ్వా విమర్శించేది అని అన్నా రాంబాబు కడిగిపారేశారు. జగన్ బొమ్మతో తాను గెలుస్తానని.. దమ్ముంటే రాజీనామా చేసి పోటీచేస్తా నువ్వు నాపై నిలబడి గెలువు అంటూ సవాల్ చేశారు. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మరి అన్నా రాంబాబు సవాల్ ను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తాడా?లేదా అన్నది ఆసక్తిగా మారింది. చూడాలి ఏం జరుగుతోందో?

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్