https://oktelugu.com/

అంతకుమించి బిగ్ బాస్ షోతో సాధించేది ఏం లేదా ?

సమాజంలో కొత్త ఎప్పుడూ వింతగానే ఉంటుంది, ఆ తర్వాత కొంత కాలానికి అది సాధారణంగా మారిపోతుంది. ఇదేవిధంగా బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసే సభ్యుల జీవితాలు కూడా మారిపోతుంటాయి. ప్రతి సంవత్సరం కొత్త సీజన్ లో కొత్త కంటెస్టెంట్స్ వస్తారు. వారి నడవడికతో సంపాదించుకునే అభిమానంతో ఈ షోలో ఎన్నాళ్ళు ఉంటారనేది ఆధారపడుతుంది. అయితే షోలో ఉన్నంత కాలం వీరికి ఒక స్టార్ హీరో కన్నా ఎక్కువగా ఫాలోయింగ్ వుంటుంది. Also Read: తనకు ప్రాణ హాని […]

Written By:
  • admin
  • , Updated On : January 24, 2021 / 04:16 PM IST
    Follow us on


    సమాజంలో కొత్త ఎప్పుడూ వింతగానే ఉంటుంది, ఆ తర్వాత కొంత కాలానికి అది సాధారణంగా మారిపోతుంది. ఇదేవిధంగా బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసే సభ్యుల జీవితాలు కూడా మారిపోతుంటాయి. ప్రతి సంవత్సరం కొత్త సీజన్ లో కొత్త కంటెస్టెంట్స్ వస్తారు. వారి నడవడికతో సంపాదించుకునే అభిమానంతో ఈ షోలో ఎన్నాళ్ళు ఉంటారనేది ఆధారపడుతుంది. అయితే షోలో ఉన్నంత కాలం వీరికి ఒక స్టార్ హీరో కన్నా ఎక్కువగా ఫాలోయింగ్ వుంటుంది.

    Also Read: తనకు ప్రాణ హాని ఉందంటున్న అర్జున్ రెడ్డి నటి

    ఈ షో ద్వారా పాపులర్ అయ్యి అవకాశాలని అందిపుచ్చుకుని డబ్బు సంపాదించుకోవాలనే లక్ష్యంతోనే దాదాపుగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరూ అడుగు పెడతారు. వారు అనుకున్నట్లుగా పాపులారిటీ వస్తుంది కానీ ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ షో నుండి అలా లక్ష్యాన్ని చేరుకొని ఎదిగిన వారు లేకపోవటం వింతగానే ఉంది. షో నుండి బయటకి వచ్చిన తర్వాత ఆ పాపులారిటీని పెంచుకోవటం కాదు కదా అసలు నిలబెట్టుకోలేక పోతున్నారు. అవకాశాలు వారి వద్దకు రావట్లేదా లేక వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోవట్లేదో అర్ధం కావట్లేదు.

    Also Read: శ‌ర్వానంద్ తో పోటీకి సిద్దమవుతున్న శ్రీ‌విష్ణు !

    ఆనందించాల్సిన విషయం ఏంటంటే వెండితెర మీద వీరు అనుకున్నది సాధించలేకపోయినా మరో రకంగా లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. పెరిగిన టెక్నాలజీ అభివృద్ధి కారణంగా అందరికీ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఫాలోవర్స్ సంఖ్య బాగా పెరిగి వీటి ద్వారా ఆదాయం కూడా ఎక్కువగానే లభిస్తుంది. ఇలా అయినా కొంతలో కొంత మంచి జరుగుతుందని బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయాలనుకునే వారు ఆశపడుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్