https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ‘జాతిరత్నాల’ సినిమా కష్టాలు

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.. అయితే విడుదలయ్యేవి కొన్నే. విడుదలకు నోచుకోక మూలనపడే సినిమాలు వందల్లో ఉంటాయి. ఆ సినిమా కష్టాలపై తీస్తున్న రియాలిటీ సినిమానే ‘జాతిరత్నాలు’. Also Read: అంతకుమించి బిగ్ బాస్ షోతో సాధించేది ఏం లేదా ? ఇద్దరు నవతరం కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నవీన్ పొలిశెట్టి లాంటి యువ హీరో నటిస్తున్న ఈ ‘జాతిరత్నాలు’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అనుదీప్ కేవి దర్శకత్వం […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2021 / 06:26 PM IST
    Follow us on

    టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.. అయితే విడుదలయ్యేవి కొన్నే. విడుదలకు నోచుకోక మూలనపడే సినిమాలు వందల్లో ఉంటాయి. ఆ సినిమా కష్టాలపై తీస్తున్న రియాలిటీ సినిమానే ‘జాతిరత్నాలు’.

    Also Read: అంతకుమించి బిగ్ బాస్ షోతో సాధించేది ఏం లేదా ?

    ఇద్దరు నవతరం కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నవీన్ పొలిశెట్టి లాంటి యువ హీరో నటిస్తున్న ఈ ‘జాతిరత్నాలు’ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అనుదీప్ కేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమా పతాకంపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. మార్చి 11న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

    తాజాగా నవీన్ పొలిశెట్టిని జోగిపేట శ్రీకాంత్ గా పరిచేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్ నవ్వులు పూయిస్తోంది. సినిమా విడుదలకు నోచుకక మగ్గిపోవడంతో అందులో నటించి ఎదురుచూస్తున్న యువకుల కథగా తెలుస్తోంది. ఇందులో జైలు జీవితం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

    Also Read: నిహారిక నాతో ఇంతకు ముందులా మాట్లాడట్లేదు: నాగబాబు

    ఇంట్లో కాదు.. థియేటర్స్ లో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం అంటూ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే థియేటర్లలోకి సినిమా వస్తుందని కొడుకు పుట్టాక కూడా రిలీజ్ చేయలేదని డైలాగులు ట్రైలర్ లో వినిపించాయి. మహాశివరాత్రి కానుకగా మార్చి11న సినిమానువ ిడుదల చేస్తున్నారు.