నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 67 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్‌ఎండీసీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్-2021 స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: ఇంటర్ సాఫ్ట్ వేర్ జాబ్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?
67 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.nmdc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను చేసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: ఎన్టీపీసీలో 230 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వాళ్లు మాత్రమే అర్హులు..?
మొత్తం 67 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రికల్ ఉద్యోగ ఖాళీలు 10, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ 25, మెకానికల్ 14, మైనింగ్ 18 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపులు అమలవుతాయి.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన వాళ్లు, ఎం.ఈ / ఎంటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్-2021 పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.