Homeఎంటర్టైన్మెంట్ఎక్స్ క్లూజివ్ : చరిత్ర కారుడిగా బాలయ్య.. పూరి కొత్త కథ !

ఎక్స్ క్లూజివ్ : చరిత్ర కారుడిగా బాలయ్య.. పూరి కొత్త కథ !

Balayya Puri
నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం విభిన్నమైనది. ఆయనకు త్వరగా మనుషులు నచ్చరు, కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే ఇక వారిని సొంత మనుషుల్లా చూసుకుంటారని, వారితో మళ్ళీ విడిపోవడం దాదాపు అసాధ్యమని బాలయ్య గురించి తెలిసిన వాళ్ళు అంటుంటారు. అయితే చాలామంది దర్శకులు ఉన్నా, బాలయ్యకు మాత్రం కొంతమంది పై మాత్రమే గురి కుదురుతుంది. వాళ్ళు తనకు హిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వారికి మాత్రం బాలయ్య అవకాశం ఇస్తాడు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్ కూడ ఒకరు.

Also Read: రకుల్ తరువాత ప్రణీతను పట్టుకున్నాడు !

పూరి కూడా మీకు ఏ హీరోతో పని చేయడం అంటే ఇష్టం అని అడిగితే బాలయ్యతో చేయడం ఇష్టం అంటుంటాడు. ఏది ఏమైనా అందరూ బాలయ్య కోపానికి భయపడితే, బోయపాటి, పూరి లాంటి డైరెక్టర్లు మాత్రం ఆయనను చూసి ముచ్చటపడిపోతుంటారు. ఆయనలో చూసిన నిజాయితీ ఎక్కడా చూడలేదని అందుకే ఆయనంటే తనకు ఇష్టమని, పూరి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. బాలయ్య కూడా అంతే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నటించడం అంటే తనకు ఇష్టమని ఇప్పటికే మీడియా ముందే చెప్పాడు.

Also Read: వక్షోజాలు చూసి సర్జరీ చేయించుకో అన్నారు – ‘ప్రియాంక చోప్రా’

అందుకే పూరి, బాలయ్య కోసం ఓ డిఫరెంట్ కథ రాశాడని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య చరిత్ర కారుడు అని తెలుస్తోంది. పల్నాటి ప్రాంతానికి చెందిన బ్రహ్మనాయుడు కాలం నాటి కథ ఇది అని తెలుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘పైసా వసూల్’ అనే చిత్రం వచ్చింది. కానీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా.. బాలయ్య నటన మాత్రం సినిమాలో కొత్తగా ఉండనే ప్రశంసలు అందాయి. ఆ ఉత్సాహంతోనే బాలయ్య – పూరి మళ్ళీ సినిమా చేయబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

Exit mobile version