శుభకార్యాలకు వెళ్లే సమయంలో పిల్లి ఎదురు వస్తే వెనక రావడానికి కారణం ఇదే..!

మన భారతదేశంలో ఎన్నో సాంప్రదాయాలను పాటించడంతో పాటు మూఢనమ్మకాలను కూడా ఎక్కువగా విశ్వసిస్తారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు కచ్చితంగా వారు కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఏదైనా శుభకార్యాలకు లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో ఎదురుగా పిల్లి వస్తే మన పెద్దవారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. పిల్లి ఎదురొచ్చింది అపశకునం వెనక్కి రమ్మని చెబుతుంటారు. అయితే పిల్లి ఎదురు రావడాన్ని ఎందుకు మూఢ నమ్మకంగా, అశుభంగా పరిగణిస్తారో ఇక్కడ […]

Written By: Navya, Updated On : February 9, 2021 1:25 pm
Follow us on

మన భారతదేశంలో ఎన్నో సాంప్రదాయాలను పాటించడంతో పాటు మూఢనమ్మకాలను కూడా ఎక్కువగా విశ్వసిస్తారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు కచ్చితంగా వారు కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఏదైనా శుభకార్యాలకు లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో ఎదురుగా పిల్లి వస్తే మన పెద్దవారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. పిల్లి ఎదురొచ్చింది అపశకునం వెనక్కి రమ్మని చెబుతుంటారు. అయితే పిల్లి ఎదురు రావడాన్ని ఎందుకు మూఢ నమ్మకంగా, అశుభంగా పరిగణిస్తారో ఇక్కడ తెలుసుకుందాం…

Also Read: ఈ ఆవు ధర 2.61 కోట్ల రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..?

పూర్వకాలంలో పెద్దవారు ఒకచోట నుంచి మరొక చోటుకు ప్రయాణించాలంటే ఎడ్లబండిపై వెళ్లేవారు. ఈ విధంగా ఎడ్లబండిపై ప్రయాణం చేయాలంటే ఎంతో ఆలస్యం అయ్యేది.కొన్నిసార్లు దారి మధ్యలో ఎన్నో అవాంతరాలు ఏర్పడతాయి.అదే విధంగా అటవీ ప్రాంతాలలో చీకటి పడటం వల్ల అడవులలో నివసించే టువంటి పిల్లి జాతికి చెందిన పులులు, సింహాలు ఎదురు పడటం వల్ల ప్రమాదాలు జరుగుతాయని భావిస్తారు. అందుకోసమే ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు లేదా పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు పిల్లి అడ్డుగా వస్తే అపశకునం అని భావించేవారు.

Also Read: ఆ ఊరిలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే.. ఎక్కడంటే..?

అయితే మన భారతదేశంలో పిల్లిని ఒక మూఢ నమ్మకంగా, అపశకునంగా భావిస్తారు. కానీ కొన్ని దేశాలలో పిల్లి ఎదురు రావడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ విధంగా బయటకు వెళ్లే సమయంలో పిల్లి అటుగా వస్తే వారి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని భావిస్తుంటారు. అయితే మన దేశంలో మాత్రమే పిల్లిని అపశకునం అని భావిస్తారు. కానీ ఎంతో మంది పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకుంటారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం