https://oktelugu.com/

ఏపీలో మరో ‘దిశ’.. యువతి పాశవిక హత్య

పదిరోజుల కిందటే ఉద్యోగంలో చేరింది.. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ఆరంభించింది. ఆ ఆనందం తీరకముందే దారుణ హత్యకు గురైంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత (19) అనే ఎస్సీ వర్గానికి చెందిన యువతిని అత్యంత పాశవికంగా హతమార్చడం కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. పొట్ట కింది భాగంగా నిప్పు అంటించారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. Also Read: జగన్‌.. మరో చారిత్రక నిర్ణయం హైదరాబాద్ లో జరిగిన ‘దిశ’ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 24, 2020 / 08:21 AM IST
    Follow us on

    పదిరోజుల కిందటే ఉద్యోగంలో చేరింది.. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ఆరంభించింది. ఆ ఆనందం తీరకముందే దారుణ హత్యకు గురైంది. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత (19) అనే ఎస్సీ వర్గానికి చెందిన యువతిని అత్యంత పాశవికంగా హతమార్చడం కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశారు. పొట్ట కింది భాగంగా నిప్పు అంటించారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది.

    Also Read: జగన్‌.. మరో చారిత్రక నిర్ణయం

    హైదరాబాద్ లో జరిగిన ‘దిశ’ హత్యోదంతాన్ని గుర్తు చేస్తూ అనంతపురం జిల్లాలో ఈ పాశవిక హత్య జరిగింది. అనంతపురం అశోక్ నగర్ కు చెందిన స్నేహలత ధర్మవరం స్టేట్ బ్యాంకులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా 10 రోజుల కిందటే విధుల్లో చేరారు. రోజూ లాగానే మంగళవారం సాయంత్రం 6 గంటలకు బ్యాంకులో విధులు ముగించుకొని బయటకొచ్చింది.ఇంటికి చేరలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    రాజేశ్ అనే యువకుడు ప్రేమ పేరిట వేధింపులకు గురిచేస్తున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే పోలీసులు స్పందించలేదు. ఇప్పుడు అదే నిండు ప్రాణం పోయేలా చేసింది.

    Also Read: అచ్చెన్నాయుడు, రామానాయుడుకు నోటీసులు

    రాజేశ్ సాయంత్రం 6.45 గంటలకు స్నేహలతను బలవంతంగా బైక్ ఎక్కించుకొని బడన్నపల్లి పొదలవైపు తీసుకెళ్లాడు. అక్కడ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నిప్పంటించాడు. అనంతరం పరారయ్యాడు.

    ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాజేశ్ నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్