తొలి సారి బీజేపీ బడ్జెట్ పై శివాలెత్తిన వైసీపీ

ఇన్నాళ్లు పౌరుషం లేని వాళ్లుగా.. కేంద్రంలోని బీజేపీ అంటే భయపడేవారుగా వైసీపీకి పేరును ఆపాదించింది తెలుగుదేశం పార్టీ. కేంద్రంలోని మోడీషాలకు జగన్ భయపడుతున్నాడని.. వారికి అందుకే మద్దతిస్తున్నారని.. ప్రతి బీజేపీ బిల్లుకు కేంద్రంలో మద్దతు ఇస్తున్నారని జగన్ పై అపవాదు ఉంది. ఇప్పటివరకు బీజేపీ పార్లమెంట్ లో తెచ్చిన ఏ బిల్లు,ప్రతిపాదనకు ఏపీలోని వైసీపీ వ్యతరేకించలేదు. కానీ ఫస్ట్ టైం కేంద్రబడ్జెట్ పై వైసీపీ శివాలెత్తింది. ఆ పార్టీ నంబర్ 2.. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు చూసే […]

Written By: NARESH, Updated On : February 1, 2021 9:05 pm
Follow us on

ఇన్నాళ్లు పౌరుషం లేని వాళ్లుగా.. కేంద్రంలోని బీజేపీ అంటే భయపడేవారుగా వైసీపీకి పేరును ఆపాదించింది తెలుగుదేశం పార్టీ. కేంద్రంలోని మోడీషాలకు జగన్ భయపడుతున్నాడని.. వారికి అందుకే మద్దతిస్తున్నారని.. ప్రతి బీజేపీ బిల్లుకు కేంద్రంలో మద్దతు ఇస్తున్నారని జగన్ పై అపవాదు ఉంది. ఇప్పటివరకు బీజేపీ పార్లమెంట్ లో తెచ్చిన ఏ బిల్లు,ప్రతిపాదనకు ఏపీలోని వైసీపీ వ్యతరేకించలేదు. కానీ ఫస్ట్ టైం కేంద్రబడ్జెట్ పై వైసీపీ శివాలెత్తింది. ఆ పార్టీ నంబర్ 2.. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు చూసే ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్రబడ్జెట్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బడ్జెట్ లో కేంద్రం ఏపీపై సవతితల్లి ప్రేమ చూపించిందని కడిగేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే నాలుగు రాష్ట్రాలపై మాత్రమే ఈ బడ్జెట్ వరాలు కురిపించిందని ధ్వజమెత్తారు.

ఈ బడ్జెట్ దేశానికి బడ్జెట్ లా లేదని.. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల బడ్జెట్ లా ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖపట్నం, విజయవాడ కోసం మెట్రో రైలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం దారుణమని విజయసాయి మండిపడ్డారు., దీనికి గతంలో అనేక సార్లు లేవనెత్తినా కేంద్రం పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తావించదగిన ఒక్క రైల్వే ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించలేదని, రాష్ట్రాన్ని కలిపే ఏకైక కారిడార్ మంజూరు చేశారని.. ఇది రాష్ట్రానికి ఉపయోగపడదని విమర్శించారు. కిసాన్ రైళ్లలో రాష్ట్రానికి ప్రస్తావించలేదని ఆయన అన్నారు.

ఆరు సంవత్సరాలుగా రాష్ట్రానికి మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినా బడ్జెట్ లో పెడచెవిన పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్రం దీనిని పరిగణించలేదని, చెన్నై, కొచ్చి, బెంగళూరులకు మెట్రో రైలు ప్రాజెక్టులకు భారీగా నిధులు మంజూరు చేశారని విమర్శించారు.