https://oktelugu.com/

బీ రెడీ.. మోహరిస్తున్న జగన్..

అందరికంటే ముందే చంద్రబాబు కర్చీఫ్ వేసేశాడు.. తెలంగాణలో విజయాలతో బీజేపీ కూడా అక్కడ దూకుడు పెంచింది. ఇక తిరుపతి ఎంపీ సీటు మాదే అంటూ పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్, రైతుల పరామర్శ పేరుతో ఓసారి చుట్టివచ్చాడు. అందుకే ఇదేదో దెబ్బకొస్తుందని భావించిన వైసీపీ అధినేత సీఎం జగన్ తాజాగా మోహరించేశారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఏకంగా ఐదుగురు మంత్రులతో తొలి వైసీపీ ప్రచార సభను నిర్వహించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ చేశారు. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2020 4:03 pm
    Follow us on

    అందరికంటే ముందే చంద్రబాబు కర్చీఫ్ వేసేశాడు.. తెలంగాణలో విజయాలతో బీజేపీ కూడా అక్కడ దూకుడు పెంచింది. ఇక తిరుపతి ఎంపీ సీటు మాదే అంటూ పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్, రైతుల పరామర్శ పేరుతో ఓసారి చుట్టివచ్చాడు. అందుకే ఇదేదో దెబ్బకొస్తుందని భావించిన వైసీపీ అధినేత సీఎం జగన్ తాజాగా మోహరించేశారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఏకంగా ఐదుగురు మంత్రులతో తొలి వైసీపీ ప్రచార సభను నిర్వహించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ చేశారు.

    Also Read: మారుతున్న వీర్రాజు స్వరం.. కారణమేంటి?

    తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సర్వేపల్లిలో సచివాలయాల ప్రారంభోత్సవం పేరుతో వైసీపీ నిర్వహించిన తొలి బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. ఏకంగా ఐదుగురు వైసీపీ మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై తిరుపతి ఉప ఎన్నికల ప్రచార నగారాను మోగించారు.

    చనిపోయిన తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కుమారుడితోనే వైసీపీ ప్రచార తొలి ఉపన్యాసం చేయించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తమ కుటుంబానికి జగన్ టికెట్ ఇవ్వడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలను దుర్గప్రసాద్ తనయుడు ఖండించాడు. జగన్ తమకు న్యాయం చేస్తాడని తెలిపారు.

    Also Read: ఏలూరు వ్యాధికి కారణమిదే.. తేల్చిన నిపుణులు.. ఇక జిల్లాకో ల్యాబ్

    ఈ సభలో అన్నింటికంటే ట్విస్ట్ ఏంటంటే వైసీపీ తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడమే.. అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే.. ఖరారు చేయకుండా మంత్రులంతా తిరుపతిలో వైసీపీని గెలిపించాలని కోరడం విశేషం. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే కావడంతో ఇక్కడ వైసీపీ గెలుపు సునాయాసంగానే కనిపిస్తోంది.

    ఇలా వైసీపీ అధినేత జగన్ తెలంగాణలో లాగా బీజేపీకి , ప్రతిపక్ష టీడీపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ఐదుగురు మంత్రులకు తిరుపతి పార్లమెంట్ బాధ్యతలను అప్పగించినట్టు సమాచారం. మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గౌతం రెడ్డి, నారాయణ స్వామి , బాలినేని శ్రీనివాస్ రెడ్డిలు ఈ ఎన్నికలను లీడ్ తీసుకొని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నట్టు సమాచారం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్