- Telugu News » Ap » Today is the public meeting of amravati farmers
నేడు అమరావతి రైతుల బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని రాజధానిగా ఉంచాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి రైతులకు మద్దతుగా బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాయపూడిలోని పెట్రోల్ బంకు దగ్గర బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 20 వేల మందికి పైగా హాజరయ్యేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు మద్దతుగా కదిలిరానున్నారు. కాగా అమరావతి […]
Written By:
, Updated On : December 17, 2020 / 09:04 AM IST

ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని రాజధానిగా ఉంచాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కలిసి రైతులకు మద్దతుగా బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాయపూడిలోని పెట్రోల్ బంకు దగ్గర బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 20 వేల మందికి పైగా హాజరయ్యేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు మద్దతుగా కదిలిరానున్నారు. కాగా అమరావతి సభను నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి ఇచ్చినట్లు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు