కరోనా లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ సినిమాలు విడుదల అవుతాయా? థియేటర్ల జనాలు వస్తారా? చూస్తారా? అన్న ఆందోళనలు టాలీవుడ్లో ఉండేవి.. కానీ ‘సోలో బ్రతుకే సోబెటర్’ అన్న మూవీతో జనాలు మునుపటిలాగానే ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు.
Also Read: ‘సమంత’ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ !
ఈ క్రమంలోనే ఇప్పుడు సంక్రాంతికి మరిన్ని సినిమాలు వస్తున్నాయి. టాగోర్ మధు నిర్మించిన రవితేజ మూవీ ‘క్రాక్’ కూడా విడుదల అవుతోంది. కలెక్షన్లపై భయాందోళనల నడుమ ఈ సినిమా మంచి బిజినెస్ చేయడం టాలీవుడ్ కూ ఊరటనిచ్చింది.
కరోనా తర్వాత ఏ సినిమాకు రానంత బిజినెస్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు భోగట్టా.. కానీ ఇప్పుడు సినిమా అమ్మకం ధరలు చూశాక ‘క్రాక్’కు లాభాల పంట పండడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: ‘ప్రగతి’ ఆంటీ మాట వింటే ‘జీవితంలో మీరు..?
‘క్రాక్’ సినిమాను ఆంధ్ర ఏరియాకు రూ.8కోట్లు, నైజాం రూ.6.30 కోట్లు, సీడెడ్ 2.70 కోట్లకు థియేటర్ హక్కులు ఇచ్చారు. నాన్ థియేటర్ హక్కుల్లో భాగంగా హిందీ డబ్బింగ్ 11 కోట్లు, డిజిటల్ కోట్లు, శాటిలైట్ 6 కోట్లు మా టీవీకి ఇచ్చినట్టు సమాచారం. ఇవే కాకుండా ఆడియో, బోర్డర్ ఏరియాల రైట్స్ మరికొంత వచ్చాయి. ఈ లెక్కలన్నీ చూస్తే 42 కోట్లకు పైగానే వసూళ్లు విడుదలకు ముందే వచ్చాయి. సినిమా కొంచెం ఆడినా ఇంకా లాభాలు ఖాయం. దీంతో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ‘క్రాక్’ తో హీరో రవితేజ, నిర్మాత టాగోర్ మధు లాభపడినట్టే లెక్క.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్