https://oktelugu.com/

ప్రభాస్ తో ప్రపంచ సినిమా.. కన్ఫ్యూజ్ లో నాగ్ అశ్విన్

బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ ఏకంగా పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు.ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నట్టు గ్రాండ్ గా అనౌన్స్ చేశాడు. తీరా సినిమా ఎప్పుడంటే మాత్రం నాగ్ అశ్విన్ తనకే అర్థం కావడం లేదంటున్నాడు. ప్రభాస్ కోసం దేశంలో ఎవ్వరూ ఇంతవరకు చూడని ‘సైన్స్ ఫిక్షన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2021 / 07:10 PM IST
    Follow us on

    బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ ఏకంగా పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు.ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నట్టు గ్రాండ్ గా అనౌన్స్ చేశాడు.

    తీరా సినిమా ఎప్పుడంటే మాత్రం నాగ్ అశ్విన్ తనకే అర్థం కావడం లేదంటున్నాడు. ప్రభాస్ కోసం దేశంలో ఎవ్వరూ ఇంతవరకు చూడని ‘సైన్స్ ఫిక్షన్ ’ కథను నాగ్ అశ్విన్ రెడీ చేశాడట.. ఆ సినిమా కథ, స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందట.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ అందరికీ కొత్తగా ఉందట.. అసలు ఎలా చేయాలో కూడా యూనిట్ లో ఎవరికీ అర్థం కావడం లేదట..

    అందుకే ‘ఆదిత్య 369’ లాంటి సైన్స్ ఫిక్షన్ తీసిన అలనాటి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సహాయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ కోరాడట.. దీనికి ఆయనే సరేనని ఈ టీంలో స్క్రీన్ ప్లే లో భాగమయ్యాడు. అయితే ప్రభాస్ సినిమా కథను ఎలా కొలిక్కి తేవాలో తెలియక ఆలస్యమవుతోందని నాగ్ అశ్విన్ తెలిపారు.

    ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ తీస్తున్న ప్రభాస్ ఆ తర్వాత ‘ఆదిపురుష్’ను ప్యాన్ ఇండియాలో లెవల్లో తీస్తున్నాడు. సలార్ కూడా లైన్లో ఉంది. ఈ క్రమంలోనే ఇవన్నీ అయిపోయాక జూన్ నుంచి మెల్లిగా తన సినిమా షూటింగ్ మొదలుపెడుతానని నాగ్ అశ్విన్ చెబుతున్నాడు. కథలోనే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ఈ మహానటి తీసిన దర్శకుడు ఇక ప్రభాస్ తో ప్యాన్ ఇండియా మూవీ ఎలా తీస్తాడన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.