https://oktelugu.com/

టక్ జగదీష్ టీజర్ టాక్: పైకి టక్కేసిన నాని.. లోపలి ఉతికేశాడు

‘టక్ జగదీష్’ అంటే నీటుగా టక్ వేసుకొని బుద్దిగా ఏదో సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునేలా హీరో నాని ఉంటాడని అనుకున్నాం. ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ లలో అలానే చూపించారు. కానీ ఇప్పుడు మాత్రం ఊర మాస్ పర్ ఫామెన్స్ అదీ టక్ వేసుకొనే నాని చూపించాడు. చివర్లో మాత్రం బనియన్ తో కింద పంచె కట్టుకొని రఫ్ ఆడించాడు. Also Read: రెండో పెళ్లిపై సురేఖవాణి స్పంద‌న‌.. నిజం చెప్పిన […]

Written By: , Updated On : February 23, 2021 / 06:15 PM IST
Follow us on

‘టక్ జగదీష్’ అంటే నీటుగా టక్ వేసుకొని బుద్దిగా ఏదో సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునేలా హీరో నాని ఉంటాడని అనుకున్నాం. ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ లలో అలానే చూపించారు. కానీ ఇప్పుడు మాత్రం ఊర మాస్ పర్ ఫామెన్స్ అదీ టక్ వేసుకొనే నాని చూపించాడు. చివర్లో మాత్రం బనియన్ తో కింద పంచె కట్టుకొని రఫ్ ఆడించాడు.

Also Read: రెండో పెళ్లిపై సురేఖవాణి స్పంద‌న‌.. నిజం చెప్పిన నటిమ‌ణి!

హీరో నాని , హీరోయిన్ రితూ వర్మ కాంబినేషన్ లో శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్ జగదీశ్’. ఈ టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ ఒక ఫుల్ పాటతో నాని పాత్ర ఎలా ఉంటుందో మొత్తం చూపించారు.

ఫిబ్రవరి 24 నాని పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులకు ఈ ట్రీట్ ను ఇచ్చాను మేకర్స్.టీజర్ ను సరికొత్తగా కట్ చేశారు. సాధారణంగా పంచ్ డైలాగులు, కామెడీ ని కాసింత ట్రైలర్ లో చూపిస్తారు. కానీ ఇందులో మొత్తం ఒక పాట మాత్రమే ఉంది.

Also Read: కుస్తీ వీరుల‌తో బ‌స్తీమే స‌వాల్‌.. మ‌ట్టి క‌రిపించిన ప‌వ‌ర్ స్టార్‌..!

నిన్ను కోరి తో హిట్ కొట్టిన నాని-శివనిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం ఇదీ. ఇందులో జగపతిబాబు హీరో నానికి అన్నయ్యగా నటించాడు. తమన్ సంగీతం అందించాడు.

కుటుంబం కోసం ఏమైనా చేసే హీరోగా నాని కనిపించాడు. ‘నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నది’ అంటూ తన కుటుంబం కోసం జగదీష్ ఏం చేశాడనేది ఇందులో చూపించారు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 23న విడుదల చేశారు.

Tuck Jagadish Teaser | Nani | Ritu Varma | Jagapathi Babu | Thaman S | Shiva Nirvana | Shine Screens