https://oktelugu.com/

న‌రేష్ న్యూడ్ గా న‌టించింది నిజ‌మేనా? క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు!

ఒక్క సక్సెస్ కోసం అల్లరి నరేష్ చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా విజయానికి మొహం వాచిపోయిన అల్లరోడు.. ఎట్టకేలకు ‘నాంది’తో తన కోరిక తీర్చుకున్నాడు. అంతేకాదు.. ఈ విజయంతో తన ‘సెకండ్ జర్నీ’ని డిఫరెంట్ గా మొదలు పెట్టాడని చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి సక్సెస్ నమోదు చేయడంతో హ్యాపీగా ఉన్నాడు నరేష్. అయితే.. ఈ సినిమాలో నరేష్ నటించిన న్యూడ్ సీన్ పై చర్చ సాగుతోంది. Also Read: టక్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 23, 2021 / 07:19 PM IST
    Follow us on


    ఒక్క సక్సెస్ కోసం అల్లరి నరేష్ చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా విజయానికి మొహం వాచిపోయిన అల్లరోడు.. ఎట్టకేలకు ‘నాంది’తో తన కోరిక తీర్చుకున్నాడు. అంతేకాదు.. ఈ విజయంతో తన ‘సెకండ్ జర్నీ’ని డిఫరెంట్ గా మొదలు పెట్టాడని చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి సక్సెస్ నమోదు చేయడంతో హ్యాపీగా ఉన్నాడు నరేష్. అయితే.. ఈ సినిమాలో నరేష్ నటించిన న్యూడ్ సీన్ పై చర్చ సాగుతోంది.

    Also Read: టక్ జగదీష్ టీజర్ టాక్: పైకి టక్కేసిన నాని.. లోపలి ఉతికేశాడు

    నరేష్ ను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత స్టేషన్లో బేర్ బాడీపై కూర్చోబెడతారు. దీంతో.. ఇది నిజమేనా?లేదంటే.. కెమెరా ట్రిక్కా? అని చ‌ర్చించుకుంటున్నారు ప్రేక్ష‌కులు. అయితే.. తాజాగా ఈ విష‌యంపై స్పందించాడు ద‌ర్శ‌కుడు విజయ్ కనకమేడల. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విష‌య‌మై మాట్లాడాడు‌. ఆ సీన్ లో న‌రేష్ నిజంగానే దుస్తులు లేకుండా న‌టించాడ‌ని చెప్పాడు విజ‌య్‌.

    ‘‘మొదట సినిమా కథ చెప్పినప్పుడు షర్ట్ విప్పేస్తే సరిపోతుందని సీన్ గురించి చెప్పాము. ఆ తరువాత సీన్ చేసే సమయంలో నిజంగా ఆ సీన్ రియాలిటీగా ఉంటేనే బావుంటుందని అనుకున్నాం. అయితే ప్యాంట్ కూడా విప్పేస్తే సరిపోతుందా? అని నరేష్ మాతో అన్నారు. నేను మళ్ళీ అలా చూడగానే.. ఏంటీ అండర్ వేర్ కూడా తీసేయ్యలా అని అన్నారు. అప్పుడు నేను అవును అని అన్నాను’’ అని చెప్పారు విజయ్.

    Also Read: రెండో పెళ్లిపై సురేఖవాణి స్పంద‌న‌.. నిజం చెప్పిన నటిమ‌ణి!

    అయితే.. అండర్ వేర్ తీసేయ్యకుండా బ్లర్ చేద్దామని చెప్పాడట నరేష్. కానీ.. సీన్ లో రియాలిటీ దెబ్బ తింటుందని చెప్పడంతో అంగీకరించాడట హీరో. ‘‘నరేష్ ఆ ప్రాంతం వరకు బ్లర్ చేద్దాం అని చెప్పారు. కానీ.. అది అంత కరెక్ట్ గా రాదని, అండర్ వేర్ తీస్తేనే సీన్ రియాలిటీగా అనిపిస్తుందని చెప్పాను. దీంతో.. ఆయన పెద్దగా ఆలోచించలేదు.’’ అని చెప్పాడు దర్శకుడు.

    ఎందుకంటే.. ఏ తప్పు చేయని వాడు పాపం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని ఆడియన్స్ ఫీలవ్వాలంటే.. బేర్ బాడీతో నటించడం చాలా ముఖ్యంగా భావించామన్నాడు దర్శకుడు విజయ్. తన ఇంటెన్సన్ గుర్తించిన నరేష్.. వెంటనే ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నారని తెలిపాడు విజయ్. మొత్తానికి వారి కష్టానికి ప్రతిఫలంగా మంచి విజయాన్ని అందించారు ప్రేక్షకులు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్