https://oktelugu.com/

చంద్రబాబుకు ఓవైసీతో దోస్త్ కలిసివస్తుందా.?

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట… సీఎం వైయస్ జగన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీల మధ్య బంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ పార్టీపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ దోస్త్ అంటూ చేయందించారు. అవసరమైతే జగన్ పార్టీ గెలుపుకోసం ఎన్నికల ప్రచారం కూడా చేస్తానన్నారు. Also Read: గ్రేటర్ ఎన్నికలు.. విడిపోయిన సినిమా వాళ్లు.. అంతేకాదు టీడీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2020 11:37 am
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట… సీఎం వైయస్ జగన్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీల మధ్య బంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ పార్టీపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ దోస్త్ అంటూ చేయందించారు. అవసరమైతే జగన్ పార్టీ గెలుపుకోసం ఎన్నికల ప్రచారం కూడా చేస్తానన్నారు.

    Also Read: గ్రేటర్ ఎన్నికలు.. విడిపోయిన సినిమా వాళ్లు..

    అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ జగన్ రూపంలో ఉండబోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.అలాంటి దోస్త్ సీఎం జగన్ కు ఎంఐఎం దూరమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    దీన్ని చంద్రబాబు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మైనారిటీ ఓట్లలో చీలిక తెస్తే మాత్రం టీడీపీకి, చంద్రబాబుకు అది అతి పెద్ద లాభం అవుతుంది. అంటే ఒవైసీ ఏపీలో పోటీ చేస్తారన్నమాట.. అదే జరిగితే చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్లేనని అంటున్నారు. మైనారిటీల ఓట్లు పెద్దగా టీడీపీకి ఎటూ పడవు. దాంతో జగన్ బలం అలా సగానికి సగం తగ్గితే టీడీపీకి విజయ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

    ఏపీలో చూసుకుంటే మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ముస్లిం మైనారిటీ సీట్లు దాదాపు ఇరవై దాకా ఉంటాయని ఒక అంచనా. గుంటూరు, విశాఖ, కర్నూలు , చిత్తూరు కడప వంటి చోట్ల మైనారిటీలకు బాగానే బలం ఉంది. ఏపీలో అధికారం అందుకోవడానికి మ్యాజిక్ ఫిగ‌ర్ 88. వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఎంత వ్యతిరేకత ఉన్నా వంద సీట్లు వస్తాయనుకుంటే మైనారిటీ ఓట్లు భారీ ఎత్తున చీలితే 2014 నాటి ఫలితాలే వైసీపీకి వస్తాయి చంద్రబాబు అనుకుంటున్నారట.

    Also Read: రఘునందన్ రావును ఏకిపారేస్తున్న వైసీపీ

    తాజాగా బీహార్ ఎన్నికల్లో అసదుద్దీన్ అయిదు సీట్లు కొట్టేశారు. మహారాష్ట్రలో ఇలాగే మ్యాజిక్ చేసి ప్రధాన పార్టీల జాతకాలు మార్చే శారు. ఇపుడు పశ్చిమ బెంగాల్ అంటున్నారు. అలాగే 2024లో ఏపీలోనూ పోటీకి దిగుతారని తెలుస్తోంది.

    ఈ ఓట్ల చీలిక వల్ల లాభపడేది చంద్రబాబు నాయుడే అని అంటున్నారు. మజ్లీస్ పోటీ చేసినా గెలిచేది ఒకటో రెండో ఉంటే గొప్పే. కానీ మైనారిటీ ఓట్లలో చీలిక తెస్తే మాత్రం టీడీపీకి, చంద్రబాబుకు అది అతి పెద్ద లాభం అవుతుంది. జగన్ ఒవైసీతో గ్యాప్ లేకుండా చూసుకుంటారా. ఒవైసీ జగన్ మాట వింటారా. లేక ఇద్దరి మధ్యన పొత్తు కుదురుతుందా అన్నది చూడాలి. ఇవేమీ జరగకపోతే మాత్రం ఒవైసీ అనుకూలంగా మారవచ్చు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్