https://oktelugu.com/

పాదాల పగుళ్లను మాయం చేసే ఇంటి చిట్కాలివే..?

చలికాలంలో చాలామంది పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. స్త్రీ, పురుషులిద్దరిలో పాదాల పగుళ్ల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే పగుళ్ల నుంచి రక్తం కారి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. పగుళ్లు ఏర్పడిన సమయంలో పాదాలపై కొంచెం ఒత్తిడి పడినా నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పాదాల పగుళ్ల సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. నువ్వుల నూనెలో గ్లిజరిన్ కలిపి ఆ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2020 8:49 am
    Follow us on


    చలికాలంలో చాలామంది పాదాల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. స్త్రీ, పురుషులిద్దరిలో పాదాల పగుళ్ల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. పాదాల పగుళ్లు ఎక్కువగా ఉంటే పగుళ్ల నుంచి రక్తం కారి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. పగుళ్లు ఏర్పడిన సమయంలో పాదాలపై కొంచెం ఒత్తిడి పడినా నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా పాదాల పగుళ్ల సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

    నువ్వుల నూనెలో గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల పాదాలకు సరైన స్థాయిలో తేమ అంది పాదాల పగుళ్లు తగ్గుముఖం పడతాయి. బాత్ టబ్ లో గోరువెచ్చని నీళ్లను నింపి అందులో గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ వేసినా పాదాల పగుళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. వెనిగర్, పెరుగును సమపాళ్లలో తీసుకుని మసాజ్ చేసినా పాదాలు మెత్తగా మారతాయి. గోరువెచ్చని నీటిలో పాదాలను డిప్ చేసి నిమ్మతొక్కతో స్క్రబ్ చేసినా మంచి ఫలితాలు ఉంటాయి.

    రాత్రి పడుకునే సమయంలో హ్యాండ్ క్రీమ్ పాదాలకు రాసి మృదువుగా మసాజ్ చేసినా పాదాల పగుళ్లకు చెక్ పెట్టవచ్చు. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ మట్టిని పాదాలకు రాసినా పాదాల పగుళ్ల సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమే. పాదాలకు వెజిటిబుల్ ఆయిల్ లేదా కోకొనట్ ఆయిల్ అప్లై చేసినా తగిన మాయిశ్చరైజింగ్ వల్ల సమస్య తగ్గుతుంది. ప్రతిరోజూ పగిలిన పాదాలకు పెట్రోలియం జెల్లీ అప్లై చేసినా మంచి ఫలితాలు ఉంటాయి.

    బొప్పాయి మరియు అవొకొడాను పేస్ట్ లా చేసుకుని పాదాల పగుళ్లకు అప్లై చేసినా సమస్యకు చెక్ పెట్టవచ్చు. పాలు మరియు తేనె మిక్స్ చేసి పాదాలకు అప్లై చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. వేప ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ కు పసుపు రాసి పాదాలకు అప్లై చేసినా పాదాల పగుళ్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.