
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఇప్పటి నుంచే పని ప్రారంభించారు. ట్రంప్ తో చెడిపోయిన వ్యవస్థలను బాగు చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా జోబైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాపై ఒకేసారి నాలుగు సంక్షోభాలు వచ్చిపడ్డాయని కాబోయే అమెరికా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ బృందం సిద్ధమవుతోందంటూ ప్రజలకు భరోసానిచ్చాడు.
Also Read: కలకలం: క్రిస్మస్ వేళ అమెరికాలో భారీ పేలుడు
అమెరికాను ఇప్పుడు కరోనా, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, జాతి వివక్ష అనే నాలుగు సంక్షోభాలు పట్టిపీడిస్తున్నాయని జోబైడెన్ అన్నారు. జనవరి నుంచి ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా మొదటి రోజు నుంచే పని ప్రారంభిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
అమెరికా నూతన అధ్యక్షుడిగా జనవరి 20న జోబైడెన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జోబైడెన్ ఈ ట్వీట్ ను ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపైనే చేసినట్టు తెలుస్తోంది.
Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్.. ప్రపంచం అప్రమత్తం..!
ఇటీవల ఉద్దీపన పథకాలకు ట్రంప్ మోకాలడ్డి అమెరికన్లకు పథకాలు దక్కకుండా సంతకం చేయకపోవడం అక్కడి ప్రజలలో ఆగ్రవేశాలు తెప్పించింది. ఈ క్రమంలోనే జోబైడెన్ ట్వీట్ చేయగానే ట్రంప్ సర్థుకొని ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన.. ప్రభుత్వ వ్యయ బిల్లుకు ఆమోదం తెలిపాడు.
ట్రంప్ సంతకం చేయడంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది. మొదట ఈ బిల్లుపై సంతకం పెట్టనని ట్రంప్ అడ్డతిరిగారు. దీంతో ఆర్థిక కష్టాలు తప్పవని అంతా అనుకున్నారు. కానీ జోబైడెన్ విమర్శించడంతోపాటు సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చాడు. ట్రంప్ మనసు మార్చుకోవడంతో అమెరికన్లు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు