https://oktelugu.com/

క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

జనాభా పరంగా క్రిస్టియన్లు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముందంజలో ఉంటారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మినహా అంతటా క్రిస్టియన్లు ఉన్నారు. వీరంతా కూడా డిసెంబర్ 25నే క్రిస్మస్ వేడుక జరుపుకోవడం చూస్తుంటాం. అయితే అదేరోజు వీరంతా ఎందుకు క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు.. ఆ విశేషాలెంటో చూద్దాం..! Also Read: క్రిస్మస్ ట్రీ వెనుక.. ఓ ఆసక్తికరమైన కథ మీకోసం..! దాదాపు 2వేల ఏళ్ల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యంలో నజరేతు అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలోని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 19, 2020 7:44 pm
    Follow us on

    crismas

    జనాభా పరంగా క్రిస్టియన్లు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముందంజలో ఉంటారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మినహా అంతటా క్రిస్టియన్లు ఉన్నారు. వీరంతా కూడా డిసెంబర్ 25నే క్రిస్మస్ వేడుక జరుపుకోవడం చూస్తుంటాం. అయితే అదేరోజు వీరంతా ఎందుకు క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు.. ఆ విశేషాలెంటో చూద్దాం..!

    Also Read: క్రిస్మస్ ట్రీ వెనుక.. ఓ ఆసక్తికరమైన కథ మీకోసం..!

    దాదాపు 2వేల ఏళ్ల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యంలో నజరేతు అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలోని మేరీ అనే యువతికి జోసెఫ్‌ అనే యువకుడికి పెళ్లి నిశ్చయం అవుతుంది. ఇదిలా ఉంటే ఒకరోజు మేరీకి గాబ్రియేల్ అనే దేవుని దూత కలలోకి వచ్చి నువ్వు కన్యగానే గర్భవతివి అవుతావని చెబుతుంది.

    ఆ తర్వాత దేవదూత చెప్పినట్లుగానే మేరి గర్భం దాలుస్తోంది. ఈ విషయం జోసెఫ్ కు తెలియడంతో ఆమెతో పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో దైవదూత ఈసారి జోసఫ్ కలలో వచ్చి మేరీని నీవు వీడిచిపెట్టవద్దనీ.. ఆమె భగవంతుడి వరం వల్ల గర్భవతి అవుతుందని చెబుతుంది.

    ఆమెకు పుట్టే బిడ్డ దేవుడి కుమారుడని.. తనకు ఏసు అనే పేరు పెట్టమని చెబుతుంది. మేరీని విడిచి  ఎప్పుడూ విడిచిపెట్టొద్దని తనను కంటికి రెప్పలా కాపాడుకోమని దైవదూత జోసఫ్ కలలో చెబుతుంది. దేవదూ చెప్పినట్లుగా జోసఫ్ చేస్తాడు. ఆ తర్వాత వారిద్దరు కలిసి వారి స్వగ్రామమైన బెత్లేహమ్‌కు వెళ్తారు.

    Also Read: క్రిస్మస్ తాత ‘శాంటా క్లాజ్’ కథ తెలుసా?

    ఆ ఊరీలో వారికి ఉండటానికి ఇల్లు దొరకదు. దీంతో ఓ సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పిస్తాడు. ఈక్రమంలోనే డిసెంబరు 24న అర్థరాత్రి 12 తర్వాత మేరీకి ఏసుక్రీస్తు జన్మిస్తాడు. అంటే డిసెంబర్ 25వ తేది అన్నమాట. క్రీస్తు జన్మించిన తేది కావడంతోనే ఆ రోజునే క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు.

    కాగా పశ్చిమ దేశాల్లో మాత్రం క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ నెల మొదటివారం నుంచే  క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ పండుగను క్రిస్టియన్లంతా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. చర్చిలను రంగురంగుల విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. అలాగే ఎవరి ఇళ్లను వారు శుభ్రం చేసుకోవడం.. అలంకరించుకోవడం చేస్తుంటారు.

    చిన్న పెద్ద అంతా కొత్త దుస్తులు ధరిస్తారు. ఇంటిలో క్రిస్మస్ చెట్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ వేడుకల్లో శాంటాక్లాజ్(క్రిస్మస్ తాత) వేషాధారణలోని వచ్చే వ్యక్తి చిన్నారుల కోసం ప్రత్యేకంగా గిప్టులు తీసుకొచ్చి వారిన సర్ ప్రైజ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.