https://oktelugu.com/

కొత్త సీఎస్ ఎవరు? సీనియర్లు వీరే.. కేబినెట్ లో చర్చ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రిటైర్ అవ్వబోతున్నారు. సాధారణంగా ఓ పట్టాన అధికారులను నమ్మని సీఎం జగన్ ఇప్పుడు కొత్త సీఎస్ గా ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఒకసీఎస్ సుబ్రహ్మాణ్యాన్ని తొలగించిన జగన్ ఒక్క నీలం సాహ్నిని మాత్రమే రెండు సార్లు పునరుద్దరించాడు. ఇప్పుడు కాబోయే కొత్త సీఎస్ ఎవరనేది ఆసక్తిగా మారింది.  ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ లో కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే దానిపై సీఎం జగన్, […]

Written By: , Updated On : December 18, 2020 / 08:40 PM IST
Follow us on

CM Jagan Sahni

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రిటైర్ అవ్వబోతున్నారు. సాధారణంగా ఓ పట్టాన అధికారులను నమ్మని సీఎం జగన్ ఇప్పుడు కొత్త సీఎస్ గా ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఒకసీఎస్ సుబ్రహ్మాణ్యాన్ని తొలగించిన జగన్ ఒక్క నీలం సాహ్నిని మాత్రమే రెండు సార్లు పునరుద్దరించాడు. ఇప్పుడు కాబోయే కొత్త సీఎస్ ఎవరనేది ఆసక్తిగా మారింది.  ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ లో కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరనే దానిపై సీఎం జగన్, మంత్రులు చర్చించారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో కొత్త సీఎస్ పై సీఎం జగన్ చర్చించినట్టు తెలిసింది.

Also Read: జగన్ సర్కార్ కు మరో ట్విస్ట్ ఇచ్చిన నిమ్మగడ్డ

ప్రస్తుత ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని ప్లేసులో కొత్త సీఎస్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈమె తరువాత అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆధిత్యనాత్ దాస్. ప్రస్తుతం జలవనరులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు. రేసులో ఈయనే ముందున్నారు. ఇక ఈయన కంటే సీనియర్ అధికారులు ఏపీ కేడర్ లో ఉన్నారు. డాక్టర్ సమీర్ శర్మ, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర.. ఈ ముగ్గురూ ఆదిత్యనాథ్ కంటే సీనియారిటీ ఉన్న వారే.

ఇక పదవీకాలం, సీనియారిటీ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది నవంబర్ 30వరకు సర్వీసు ఉన్న సమీర్ శర్మ సీఎస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే ఆధిత్యనాథ్ వైపే జగన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

Also Read: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలివీ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈనెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 30తోనే నీలం సాహ్ని గడువు ముగిసినా సీఎం జగన్ కేంద్రంతో మాట్లాడి రెండు సార్లు ఆమె పదవీ కాలాన్ని పొడిగించారు. డిసెంబర్ 31తో ఆ పదవీ కాలం ముగుస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని జగన్ తీసేసిన తర్వాత కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని సీఎం జగన్ ఏపీ సీఎస్ గా నియమించారు. కరోనా సంక్షోభ కాలంలో సాహ్ని సమర్తవంతంగా పనిచేశారు.

ఈరోజు జరిగిన కేబినెట్ భేటిలో సీఎం జగన్, మంత్రులు సీఎస్ నీలం సాహ్నికి శాలువ కప్పి సన్మానించారు. తన హయాంలో నీలం సాహ్ని తీసుకున్న నిర్ణయాలను జగన్ కొనియాడారు. అనంతరం కొత్త సీఎస్ పై చర్చించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్