https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ ఇలా మారిపోయారేంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం పెద్దగా కష్టపడరు. రాజకీయాలపైనే ఆయన దృష్టి సారిస్తారు. సినిమాలను పార్ట్ టైం కోసం డబ్బు కోసమే చేస్తుంటారు. రాజకీయాలు, ప్రజల కోసమే ఆయన ఆలోచిస్తారు. సినిమాల కోసం ప్రభాస్ లా కండలు పెంచడం.. తగ్గించడం.. స్టైలిష్ గా కనిపించడం చేయరని పేరుంది. అయితే తాజాగా ఒక సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడట.. ఏపీలో రాజకీయం చేయకుండా.. బయటకు రాకుండా.. తన లుక్ బయటపడకుండా కండలు కరిగించేస్తున్నాడట… మలయాళ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2021 / 10:04 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం పెద్దగా కష్టపడరు. రాజకీయాలపైనే ఆయన దృష్టి సారిస్తారు. సినిమాలను పార్ట్ టైం కోసం డబ్బు కోసమే చేస్తుంటారు. రాజకీయాలు, ప్రజల కోసమే ఆయన ఆలోచిస్తారు. సినిమాల కోసం ప్రభాస్ లా కండలు పెంచడం.. తగ్గించడం.. స్టైలిష్ గా కనిపించడం చేయరని పేరుంది.

    అయితే తాజాగా ఒక సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడట.. ఏపీలో రాజకీయం చేయకుండా.. బయటకు రాకుండా.. తన లుక్ బయటపడకుండా కండలు కరిగించేస్తున్నాడట…

    మలయాళ రిమేక్ ‘అయ్యప్పమ్ కోషియమ్’ సినిమాలో పవన్ కళ్యాన్, రానా హీరోలుగా నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీ కోసం పవన్ తెగ కష్టపడుతున్నాడట.. ఇందులో పవన్ పోలీస్ గా నటిస్తున్నాడట.. ఈ గెటప్ కోసం కసరత్తులు మొదలు పెట్టినట్టు సమాచారం.

    ఇప్పటికే పవన్ చాలా సన్నబడ్డాడని.. పోలీస్ గా కండలు పెంచుతున్నాడని.. పవన్ కొత్త లుక్ బయటకు రాకుండా బోలెడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. తనను కలిసే జనసేన నాయకులతో సైతం ఫొటోలు ఈ మధ్య తీసుకోవడం లేదట.. మరి పవన్ ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న ‘అయ్యప్పం కోషియన్’ రిమేక్ లో ఎలా కనిపిస్తారు? కండలు ఎలా చూపిస్తాడన్నది ఆసక్తిగా మారింది.

    మళయాళం మూవీ ‘అయ్యప్పన్ కోశియమ్’ ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు ‘బిల్లా రంగా’గా పేరు పెట్టారు. ఈ పేరు సినిమాకు తగ్గట్టుగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. పవన్ స్నేహితుడు, దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీకి రచనా సహకారం అందిస్తున్నారు. దీంతో చిత్రంపై అంచనాలు పీక్స్ కు చేరాయి.