https://oktelugu.com/

సక్సెస్ మీట్: ఉప్పెన టాలీవుడ్ కు ఊపు తెచ్చిందన్న రాంచరణ్

కరోనాతో దేశమంతా ఇబ్బంది పడ్డా.. అన్ని రాష్ట్రాల సినీ పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినా తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం వేగంగా కోలుకుందని.. ఉప్పెన సినిమాను విజయవంతం చేసి తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ ను నిలబెట్టారని మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా వచ్చిన ‘ఉప్పెన’ మూవీని ఫిబ్రవరి 12న విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం రాజమండ్రిలో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2021 / 10:34 PM IST
    Follow us on

    కరోనాతో దేశమంతా ఇబ్బంది పడ్డా.. అన్ని రాష్ట్రాల సినీ పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయినా తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం వేగంగా కోలుకుందని.. ఉప్పెన సినిమాను విజయవంతం చేసి తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్ ను నిలబెట్టారని మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా వచ్చిన ‘ఉప్పెన’ మూవీని ఫిబ్రవరి 12న విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం బుధవారం రాజమండ్రిలో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    దేశంలో మిగతా ఇండస్ట్రీలు సినిమా విడుదల చేయాలంటే భయపడుతునన క్రమంలో సినిమాలను ఆదరిస్తూ ‘ఉప్పెన’ను హిట్ చేసిన ప్రేక్షకులకు ఎంతో రుణపడి ఉంటామని రాంచరణ్ అన్నారు. ముగ్గురు కొత్త వాళ్లతో సినిమా చేసిన నిర్మాతలకు హ్యాట్సాఫ్ అని.. విజయ్ సేతుపతి నటనను చూసి నేర్చుకోవాలనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు ఆయన గురువు సుకుమార్ గర్వపడేలా చేశాడని రాంచరణ్ అన్నారు.

    ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని.. మా అందిరిలో బాగా ఆలోచించే శక్తి వైష్ణవ్ కు సొంతమని రాంచరణ్ అన్నారు. మా వెనుకాల చిరంజీవి గారు.. పవన్ కళ్యాణ్ ఉండటం మా అందరి అదృష్టం అని.. హీరోయిన్ కృతి డేట్స్ దొరకడం భవిష్యత్ లో చాలా కష్టమని రాంచరణ్ పొగిడారు.

    ఇక దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఉప్పెన లాంటి క్లైమాక్స్ ను ఒప్పుకోవాలంటే గట్స్ ఉండాలని.. అందుకు చిరంజీవి గారు ఒప్పుకొని వైష్ణవ్ ను నాకు అప్పజెప్పిన చిరంజీవి గారికి అంకితం అని అన్నారు.

    హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ అలాంటి పాత్ర చేయడానికి నేను చాలా ఇబ్బందిపడ్డానని.. దర్శకుడు బుచ్చిబాబు నా దగ్గరుండి ధైర్యం చెప్పి నేర్పించారని చెప్పుకొచ్చాడు.