https://oktelugu.com/

ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది. ఫిబ్రవరి 26న నాగ్ అశ్విన్-ప్రభాస్ మూవీ అప్డేట్ వస్తుందని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడది రావడం లేదని స్వయంగా నాగ్ అశ్విన్ బాంబు పేల్చారు. ప్రభాస్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అభిమానులు దర్శకుడిపై సోషల్ మీడియాలో ఒత్తిడి పెంచారు. ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 17, 2021 / 09:30 PM IST
    Follow us on

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందింది. ఫిబ్రవరి 26న నాగ్ అశ్విన్-ప్రభాస్ మూవీ అప్డేట్ వస్తుందని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడది రావడం లేదని స్వయంగా నాగ్ అశ్విన్ బాంబు పేల్చారు.

    ప్రభాస్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అభిమానులు దర్శకుడిపై సోషల్ మీడియాలో ఒత్తిడి పెంచారు. ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ కి స్పందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ సినిమా గురించి జనవరి 26న లేదా ఫిబ్రవరి 26న అప్డేట్స్ ఇవ్వనున్నట్లు డేట్ తో సహా తెలియజేశారు. దీంతో నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా గురించి మరి కొంత సమాచారం కోసం మరో 10 రోజుల్లో రాబోతోందని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టారు. దర్శకుడు నాగ్ అశ్విన్ వెంటపడుతున్నారు.

    దీనిపై తాజాగా స్పందించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘హాయ్ నన్ను క్షమించండి.. ఫిబ్రవరి 26న ప్రభాస్ సినిమా అప్డేట్ ఉండదు. ఇది సరైన సమయం కాదు’ అని క్లారిటీ ఇచ్చాడు.

    ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ తోపాటు, సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయ్యాకే నాగ్ అశ్విన్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.

    ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాధేశ్యామ్” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్”చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు.