https://oktelugu.com/

‘ఫైటర్’ కోసం బాలీవుడ్ నటుడు.. విజయ్ కు పోటీనా?

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టుందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్లో వరుస అవకాశాలు రావడంతో విజయ్ బీజీగా స్టార్ గా మారిపోయాడు. విజయ్ దేవరకొండ సినిమాలన్నీ కూడా యూత్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయని చెప్పొచ్చు. Also Read: గుడ్ న్యూస్: ప్రభాస్ బర్త్ డే 23న ‘రాధేశ్యామ్’ టీజర్? ఇటీవలే విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 / 01:52 PM IST
    Follow us on

    యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టుందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్లో వరుస అవకాశాలు రావడంతో విజయ్ బీజీగా స్టార్ గా మారిపోయాడు. విజయ్ దేవరకొండ సినిమాలన్నీ కూడా యూత్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయని చెప్పొచ్చు.

    Also Read: గుడ్ న్యూస్: ప్రభాస్ బర్త్ డే 23న ‘రాధేశ్యామ్’ టీజర్?

    ఇటీవలే విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ మూవీ విడుదలైన తొలి రోజు నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ కెరీర్లో డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో విజయ్ జోరు కొంత తగ్గినట్లు కన్పిస్తోంది.

    ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్మాథ్ దర్మకత్వంలో తెరకెక్కుతున్న్ ‘ఫైటర్’ లో నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి పూరి జగన్మాథ్.. చార్మి.. కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడు. తెలుగులో పూరి-ఛార్మి నిర్మిస్తుండగా హిందీలో మాత్రం కరణ్ జోహోర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

    ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ కుర్ర భామ అనన్య పాండే నటిస్తోంది. ఆమెకు తెలుగులో ఇదే తొలి మూవీ కాగా.. బాలీవుడ్లో విజయ్ దేవరకొండకు ‘ఫైటర్’ తొలి మూవీ. తాజాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి ఎంపికయ్యడనే టాక్ విన్పిస్తోంది.

    విజయ్ దేవరకొండ ఈ మూవీలో బాక్సర్ గా కన్పించబోతున్నాడు. ఈ మూవీలో ఓ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండనుందని.. అందులో విజయ్ తండ్రి పాత్ర కీలకం కానుందని సమాచారం. ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టిని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. సునిల్ శెట్టి సైతం ఈ మూవీలో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

    Also Read: ‘రామరాజు ఫర్ భీమ్’కు చరణ్ వాయిస్ ఓవర్.. కిరాక్..!

    దీంతో సునిల్ శెట్టినే విజయ్ తండ్రి నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక కరోనాతో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. త్వరలోనే ఈ మూవీని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది.