https://oktelugu.com/

బిగ్ బాస్-4లో అత్యధిక పారితోషికం తీసుకునేది ఎవరో తెలుసా?

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదిరిపోయే టీఆర్పీ రేటుతో బిగ్ బాస్ షో దూసుకుపోతూ తెలుగులో నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది. ఈ పరంపరంను కొనసాగించేందుకు ఇటీవలే బిగ్ బాస్-4 సీజన్ ను నిర్వాహాకులు ప్రారంభించారు. ఇప్పటికే బిగ్ బాస్-4 ఐదువారాలకు పైగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. Also Read: వైరల్: అన్నయ్యను తలుచుకొని మహేష్ ఎమోషనల్ ప్రస్తుతం బిగ్ బాస్-4లో పాల్గొన్న కంటెస్టుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా […]

Written By: , Updated On : October 14, 2020 / 10:04 AM IST
Follow us on

తెలుగు రియల్టీ షోలలో ‘బిగ్ బాస్’ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదిరిపోయే టీఆర్పీ రేటుతో బిగ్ బాస్ షో దూసుకుపోతూ తెలుగులో నెంబర్ వన్ షోగా కొనసాగుతోంది. ఈ పరంపరంను కొనసాగించేందుకు ఇటీవలే బిగ్ బాస్-4 సీజన్ ను నిర్వాహాకులు ప్రారంభించారు. ఇప్పటికే బిగ్ బాస్-4 ఐదువారాలకు పైగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది.

bigg-boss-4

bigg-boss-4

Also Read: వైరల్: అన్నయ్యను తలుచుకొని మహేష్ ఎమోషనల్

ప్రస్తుతం బిగ్ బాస్-4లో పాల్గొన్న కంటెస్టుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా పెద్ద సెలబ్రెటీలేమీ కాకపోవడం ప్రేక్షకులను కొంచెం నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో బిగ్ బాస్-4 షో ప్రారంభంలో చప్పగా అనిపించింది. అయితే తర్వాత తర్వాత బిగ్ బాస్-4 ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు.

అయితే ఇందులో పాల్గొనే కంటెస్టులకు ఎవరెవరకీ ఎంత రెమ్యూనరేషన్ అందుతుందనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ అభిమానులు కంటెస్టుల పారితోషికాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్టు చూపుతున్నారు. ఈనేపథ్యంలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వీరి పారితోషికాలు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిగ్ బాస్ హౌస్ లో రోజుల లెక్కన అదిరిపోయే రెమ్యూనేషన్ కంటెస్టులకు అందుతుందడం విశేషం.

Also Read: పెళ్లయిన ప్రతీ ఆడది ఏడవాల్సిందే అంటున్న పూరి..!

ప్రస్తుత కంటెస్టుల్లో అందరికీ కంటే ఎక్కువగా జబర్దస్త్ అవినాష్ కు రెమ్యూనరేషన్ దక్కుతుందని సమాచారం. అతడికి రోజుకు దాదాపు 60 వేల పారితోషికం దక్కుతుందట. ఇక ఆ తర్వాత లాస్య 50 వేలు, మోనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్, సింగర్ నోయల్ 40 వేలు, దేత్తడి హారిక, స్వాతి దీక్షిత్ 30వేలు, గంగవ్వ, కరాటే కళ్యాణి, యాంకర్ దేవి నాగవల్లి, అభిజీత్ 25వేలు, సోహైల్ ర్యాన్, దివీ, అఖిల్ సార్థక్, అరియానా గ్లోరీ 15వేలు, సూర్య కిరణ్, మెహబూబ్ దిల్ సే, జోర్దార్ సుజాత, కుమార్ సాయి 10వేల చొప్పున రోజుకు తీసుకుంటున్నారు.