https://oktelugu.com/

భారీ వర్షం.. రైతులకు తీరని నష్టం.. పంటనష్టం ఎంతంటే..?

కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. వరుణుడు కరుణించి వానలు కురిపించాడు. గత సారి లాగే ఈసారి కూడా తెలంగాణ రైతుల పంట పండింది.కానీ పంట చేతికొచ్చే దశలో వచ్చిన తుఫాన్ ఇప్పుడు తెలంగాణ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేసింది. లక్షల ఎకరాల్లో సాగుచేసిన పంటలు నీట మునిగి..ధాన్యం రాలి ఇప్పుడు తెలంగాణలో అపార నష్టాన్ని చవిచూశాయి. Also Read: తెలంగాణ సాగుకు కేసీఆర్ కొత్త ఒరవడి తెలంగాణ రాష్ట్రంలో మూడురోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 14, 2020 / 10:11 AM IST
    Follow us on

    కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. వరుణుడు కరుణించి వానలు కురిపించాడు. గత సారి లాగే ఈసారి కూడా తెలంగాణ రైతుల పంట పండింది.కానీ పంట చేతికొచ్చే దశలో వచ్చిన తుఫాన్ ఇప్పుడు తెలంగాణ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేసింది. లక్షల ఎకరాల్లో సాగుచేసిన పంటలు నీట మునిగి..ధాన్యం రాలి ఇప్పుడు తెలంగాణలో అపార నష్టాన్ని చవిచూశాయి.

    Also Read: తెలంగాణ సాగుకు కేసీఆర్ కొత్త ఒరవడి

    తెలంగాణ రాష్ట్రంలో మూడురోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బదిన్నాయి. సాగు చేతికచ్చే సమయంలోనే వర్షాలు కురుస్తుండడంతో పంటలన్నీ నీట మునిగాయి. రాష్ట్రంలో 60.22 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 30 నుంచి 40 శాతం వరకు పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలుపుతున్నారు. వరితో పాటు పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వారు పేర్కొన్నారు.

    ప్రభుత్వ సూచనల మేరకు ఈసారి దొడ్డురకాల కంటే సన్నరకాలే ఎక్కువగా సాగు చేశారు. దీమొత్తం వరి పంట 52.56 లక్షల ఎకరాల్లో సాగవగా.. ఇందులో 39.58 లక్షల ఎకరాల్లో సన్నాలు చేశారు. అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు దిగుబడి వస్తుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

    పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు రోజుకు లక్ష ఎకరాల చొప్పున మొత్తం 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం కలిగింది. మంగళవారం ఏకంగా 3 లక్షల ఎకరాల్లో వివిధ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ సీజన్‌లో మొత్తం 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

    Also Read: కవితమ్మ గెలుపు కుటుంబస్వామ్యమా? ప్రజాస్వామ్యమా?

    బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఇప్పటి వరకు తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, మెదక్‌ ఉమ్మడి జిల్లాలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో వైపు ప్రభుత్వం పంటలపై ఎటువంటి ప్రకటన చేయడంలో లేదు. దీంతో ఇంకా ఎంత నష్టం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.